...

10 views

పుకార్లు పుట్టించిన జనం, స్టేటస్ లుగా మారిన పుకార్లు!@.P3..COM
అలా కలవాలి!
అలా చెయ్యాలి!
అలానే ఉండాలి!

ఇలాంటివి ఏన్నేనో ఒకప్పటి కాలంలో మంచి మాటలుగా పుట్టి! సమాజంలో తిరిగేవి!

కానీ......!

కాలం మారి!
టెక్నాలజీ పెరిగి!
మానవత్వం తగ్గి!
వాటినన్నిటిని పుకార్లుగా గుర్తించి
స్టేటస్ లుగా మార్చేశారు జనం!

అలాంటివి వినడానికే బాగుంటాయి
చేయడానికి కుదరదు!
అమ్మో అలాంటివి వినాలి తప్ప, వాటిపై ప్రయత్నాలు చేయకూడదు.
అమ్మో అలా అయితే జీవితం నాశనం అయ్యిపొద్ధి.
అమ్మో అలా అయితే చచ్చిపోతాం.
అమ్మో ఈరోజుల్లో నమ్మకం వుండకూడదు.
అమ్మో ఈరోజుల్లో పేగు భంధమైన లెక్కలేసుకొనే బ్రతకాలి.
అమ్మో ఈరోజుల్లో స్వార్థం ఎక్కువ.
అమ్మో ఈరోజుల్లో డబ్బుకి మించిన అదృష్టం లేదు.

ఇలా అంటుంటారు
కానీ సమాజంలోకి వెళ్ళినా
పెద్ద వాళ్ళ ముందికి వెళ్ళినా
మంచి మాటలతో సంభాషణ సాగిస్తుంటారు
ఈ ప్రక్రియ నందమూరి రామారావు గారి కాలం నాటి నుండి జరుగుతూనే ఉంది.

వాళ్ళు మంచిని విన్నారు, కొంత జనం మాత్రం చెడుకి అలవాటు పడ్డారు.

తరువాత వాళ్ళు ఎక్కువ మంచిని వినేవారు, చెడును కూడా ఎక్కువగానే చేశారు.

ఆ తరువాత జనం, ఇంకొంచెం మంచిని ఎక్కువుగా విన్నారు, విపరీతమైన చెడులు చేశారు.

ఈప్పటి మనుషులు ఏకంగా మంచిని చూసేస్తున్నారు, తనివితీరా వినేస్తున్నరు, కానీ చెడుని మాత్రం చెడ పుట్టిస్తున్నారు.

ఎంతలా అంటే...

పొద్దున్న లేచి ఎవడి ఫోన్(phone) లో స్టేటస్ చూసినా మంచికి ప్రతిబింబమే కనపడుతుంది, కానీ చెడులు మాత్రం గుంపులో గోవింద లాగా వార్తా పత్రికలలో మునిగిపోతూ ఉన్నాయి.

చివరికి ఒకప్పటి మంచి మాటలను పూకారులుగా మార్చి, వాటికి స్టేటస్ ల జీవితాన్ని ప్రసాదించారు జనం.

చేద్దాం, చేయగలం, చేసి చూపిద్దాం!
అనే పట్టుదల ఉన్న వాళ్ళు దొరికితే బాగున్ను అని అనుకునే వాళ్ళు చాలా మంది వున్నారు.
కానీ విచిత్రం ఏంటంటే అంత మందిలో ఒకరికి అలాంటి వాడు దొరకకపోవడం.

*** veMEsh ***