...

3 views

The Unlucky Girl (దురదృష్టమైన అమ్మాయి)
తాను ఒక మెరిసే మెరుపు
వెన్నెల వెలుగు వంటి చూపులు తనవి
తేనె వంటి పలుకుల మాటలు తనవి
అవును తాను ఎంతో అందమైనది,
అలాగే తెలివైనది.
తానెప్పుడూ కలలు కంటూ ఉంటుంది
తన కలలను సాధించటానికి తను చేసే
ప్రయత్నం అంతా ఇంతా కాదు ,చాలా శ్రమిస్తుంది.తనకి పెద్దగా కోరికలు లేవు కానీ తనకి ఒక అసాధారణమైన కల ఉండేది
కానీ తను ఒక అసాధారణమైన unlucky.

తనతో ఏది ఎక్కువ రోజులు ఉండదు.వస్తువులైన మనుషులైనా...
తను ఎంత జాగ్రత్త పడితే అంతకుమించి దూరం అవుతారు.ఏమి చేసినా చేయకపోయినా తనన్నంతా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండి తను చాలా unlucky ఇలానే జరుగుతూ వస్తుంది.
తన ఆకరివరకు ఇలానే ఉంటుందా? అని అనుకునేది.

తను ఏది చేసిన ఏదొ ఒక సమస్య.ప్రతిరోజూ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది. తను త్వరగా కాలేజీకి వెళ్ళిన లేట్ అవ్వడం. తను బజారుకి వెళ్లి ఏదైనా వస్తువు తేవడానికి వెళ్తే ఆ షాప్ మూసివేసి ఉండేది లేదా ఆ వస్తువు అక్కడ లేకపోవడం. తను వంట చేసేటప్పుడు,పనులు చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేస్తుంటది.
తను ఏ మాత్రం అశ్రద్దగా ఉన్న కూడా చాలా దారుణంగా ఉంటుంది అని తనకు బాగా తెలుసు. అయినా కూడా ఏదొ ఒకటి జరుగుతూ ఉంటుంది మరచిపోవడం, కిందపడిపోవడం.

ఎవరైనా తనని ఇష్టపడితే, తను వారితో ఎంత మంచిగా ఉన్న వారు ఏదోక కారణం చేత దూరం అవ్వడం. ముఖ్యంగా తన దగ్గరివారే తనని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. నిజానికి తను ఎవరిని దూషించే ప్రయత్నం కూడా చేయదు కానీ తనని దూషించటానికి ఇతరులు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు.
తాను ఆనందంగా ఉంటూ ఇతరులలో ఆనందాన్ని నింపుతది.
తాను positive vibeని ఇస్తుంది కానీ ఇతరులు అది కూడా negative చేసేస్తారు.

తను ఉన్న చోట,తనతో ఉన్నవారికి కూడా తన unlucky ప్రభావం కొంత ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉండే unlucky అంతా తనలోనే ఉందని అనుకుంటది. తను చిక్కుల్లో పడుతూ లేస్తూ ఉండేది.

తన కలలను సాధించటానికి తాను ఎంతో దురద్రుష్టంగా ఉండేది.
తాను ఒకరోజు బాగా అలసిపోయింది. ఆ క్షణం చాలా దిగులుగా ఉంది. జీవితమంతా నేను ఇలానే ఉంటే నా పరిస్థితి ఏంటి అని బాధ పడింది. తనుకు part time జాబ్ లో కూడా అదృష్టం లేకుండా పోయింది . అదృష్టం వచ్చినట్లే వచ్చి మాయం అయేది. నాకు అసలు అదృష్టమే ఉండదు కదా నేను ఇలానే ఉంటానేమో జీవితాంతం.దేవుడా....నాకు అదృష్టాన్ని ప్రసాదించండి అని గట్టిగా అరుస్తుంది. నా జీవితానికి అర్థం ఏమిటి? అని ప్రశ్నిస్తుంది.

తనని అందరు చులకన చూసేవారు.
తనకి ఏది రాదు,అన్ని తప్పులుగా చేస్తుంది
అనే మాటలతో ఏదొ ఒకటి మనసుని గాయ
పరిచేలా మాట్లాడుతుంటారు.
మొదట్లో కొద్దిగా బాధ కలిగేది కానీ
తరువాత పట్టించుకోవడం మానేసింది.
అయిన కూడా వారిని ఏమి అనేది కాదు.

తను ఓపికతో తన పనిని
తాను చేసుకుంటూ వెళ్తుంది.
తన చేసే పనిని ఎంతో ఇష్టంగా చేస్తుంటది.
పని చేయడంలో చాలా చురుకైనది.

తన కలని ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది
రాత్రి పూట కలలే కాదు పగటి పూట కూడా
కలలు కంటూ ఉంటుంది.
తన dream ని సాకారం చేసుకోవటమే
తన లక్ష్యంగా బావిస్తుంటది.

తనకు రోజు ఏదొ ఒక రూపంలో
Bad luck వెంటే వచ్చేది.
తాను ఓడినా కూడా అదే ఉత్సాహంతో
మళ్ళీ మొదలు పెట్టేది.
తాను ఎన్నో సార్లు ఓడుతూ,
తనని తాను గెలుస్తూ వచ్చింది

తనకు ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉండేది
అలా అని అక్కడే ఆగిపోలేదు.
నిరుత్సాహ పడిన కూడా
రెట్టింపు ప్రయత్నం చేస్తుండేది.

తనకు జీవితంలో ఏది కలిసిరాలేదు
ఏదేమైనా తను ఎంతో ధైర్యంగా అన్నిటినీ
ఎదుర్కొని ముందుకు సాగుతుంది
అదృష్టం కలిసి రాలేదని తను ఎప్పుడు ఎక్కువగా బాధపడలేదు
తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది
అన్నిటినీ ధైర్యంగా ఫేస్ చేసింది
చిన్నప్పటి నుంచి కూడా తానెంతో తెలివిగా ప్రవర్తించేది ఆలోచించేది.ఏటువంటి సమస్యనైన తన మనసులోనే దాచుకునేది.తాను బాధలోన్నున్న కూడా ఆ విషయాన్ని చెప్పేది కాదు.ఎవరిముందు అనవసరణ ప్రస్తావన తీసేది కాదు. జీవితంలో ఎవరికి కూడా అదృష్టం త్వరగా దక్కదు .ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి.సమస్యలను ఎదుర్కొంటూ వెళ్ళాలి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి. జీవితంలో ఎప్పుడూ కూడా మనం unlucky అనుకోకూడదు. ధైర్యాన్ని నింపుకోవాలి.
కష్టాలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కొల్పోకూడదని తనని తాను ఎంతో ధైర్యంగా మాట్లాడుకునేది. చివరికి వరకు నా కలలను సాధించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అని గట్టిగా తనకి తాను చెప్పు కుంటది. తన శ్రమని మాత్రమే నమ్ముతూ కష్టపడుతూ ముందుకు సాగుతుంది. తాను సాధరణమైన అమ్మాయి కాదు ఒక అసాధారణమైన unluckiest girl.
(తను unlucky అయినా కూడా తన ప్రయత్నాన్ని ఆపలేదు.)
పార్ట్ (1)
నీతి; మనం చేసే పని ఏదైనా జరిగిన జరగకపోయిన మనం ధృడంగా ఉండి ముందుకు సాగాలి . మన శ్రమే మన అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఆకరివరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం కన్న కలలను నేరవేర్చే దిశగా వెళ్ళాలి.

(ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి
ఇది ఒక అమ్మాయికి నిజంగా జరిగిన కథ)
avii ammulu✍️