udupi hotels
ఉడుపి హోటల్ ఎందుకంత పేరుగాంచాయో తెలుసా....
_________________________
అది ఉడిపి కాదు, ఉడుపి అని వ్రాయాలి. ఉడుపి వంట లేక భోజనం- దీని మూలం ఉడుపిలో ఉన్న కృష్ణ దేవాలయంలో, అష్ట మఠాలలో ఉంది. ఉడుపి శ్రీ మధ్వాచార్యులు జన్మించిన ఊరు. ఇది ద్వైత సాంప్రదాయ ముఖ్య కేంద్రం. అన్నదాన సేవలో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో శిక్షణ పొందిన వంటవారు ఉడిపి హోటళ్లను తెరవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి.
మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు.
అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు....