...

10 views

చెల్లి ప్రేమ
ఒక రోజు స్కూల్ కి వెళ్ళడానికి ఆ అన్నాచెల్లెళ్లు బయలుదేరారు.అప్పుడు జోరుగా వర్షం కురుస్తుంది. ఆ అన్నాచెల్లెళ్లు బస్ లో ముందు ఉన్న రెండు సింగిల్ సేటెడ్ సీట్ లో కూర్చున్నారు.ముందు అన్న కూర్చున్నాడు.అతని వెనుక తన చెల్లి కూర్చుంది.
అప్పుడు బస్ యొక్క పైకప్పు కి నుండి నీళ్ళు కారుతున్నాయి. అవి అన్నయ్య మీద పడుతున్నాయి.అలా పడడం చూసిన చెల్లి అతని యొక్క పరిస్తితి చూసి అయ్యో! మా అన్న మీద నీళ్ళు పడుతున్నాయి. అలా తడిస్తే మా అన్నకు జలుబు చేస్తుంది అని ఆ చెల్లి తన అన్నును వెనుకకి రమ్మని తను వెళ్ళి ముందు కూర్చుంది.
ఎన్ని సార్లు తన తలపై వర్షపు చినుకులు పడుతున్న వాటిని తుడుచుకుంటూ ఉంది.
ఆ చెల్లెలి మనస్సులో తన ఆన్న ను తడవకుండా చేశాను అన్న సంతృప్తి తో
తనపై ఎన్ని వర్షపు చుక్కలు పడుతున్న లెక్క చేయక పడుతున్న వాటిని తుడుస్తూ ఉంది.
అప్పుడు ఆ చిన్న పిల్ల అవస్తను చూసి ఆ దేవుడికి కూడా మనస్సు జరిగినట్టు ఉంది. ఆ బస్ లో ఉన్న ఒక అక్క తనని స్కూల్ వచ్చేంత వరకు తన వొడిలో కూర్చో పెట్టుకుంది.
ఈ కథలో ఆ పిల్లల యొక్క వయస్సు చాలా చిన్నది అయినప్పటికీ తన అన్న మీద ప్రేమతో తను వర్షం లో కూడా తడవదనికి సిద్ధ పడింది.
వారిరువురి ప్రేమకు ఆ దేవుడు కూడా చెలించి పోయి వారికి సహాయం చేశారు.
స్వచ్ఛమైన ఆ చెల్లి ప్రేమ ఎంతో గొప్పది.