...

14 views

తల్లిదండ్రులు v/s పిల్లలు
తల్లిదండ్రులు పిల్లలతో ఏ వయసులో ఎలా ఉండాలి??? ఎలా వారిని మంచి మార్గంలో పెట్టాలి??

పిల్లల్ని 6నెలల వయసు నుండి మనం వారికీ అన్ని నేర్పించుకోవాలి. పిల్లలు మంచి స్థాయికి వెళ్లారన్న, చెడు మార్గం లో వెళ్తున్నారన్న తల్లిదండ్రులదే భాద్యత. 6-12నెలల పిల్లల్లు అన్ని గమనిస్తూఉంటారు. అమ్మ నాన్న మాట్లాడే మాటల్నే పిల్లలు పలకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే మనం వాళ్ళకి మంచి మాటలని, అలవాట్లను నేర్పించుకోవాలి.

1-3సంవత్సరాల పిల్లలకి ఫోన్ కానీ టీవీ కానీ అలవాటు

చెయ్యకూడదు.కానీ సహజంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లకి ఫోన్ లో కూర్టూన్స్ పెట్టి ఇచ్చి, వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏడ్చినప్పుడు ఫోన్ ఇస్తూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు.అలా చెయ్యడం వల్ల పిల్లల కళ్ళు దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి స్పూన్స్ తో తినడం అలవాటు చెయ్యకూడదు,చేతితో తినడం వల్ల.. చేతి వేళల్లో రక్తప్రసరన జరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

4-6సంవత్సరాల పిల్లల్ని స్కూల్ లో జాయిన్ చేస్తాం.టీచర్ చెప్పేది శ్రద్ధగా వినమని మనం ఈ వయసు నుండే పిల్లలకి నేర్పించుకోవాలి.పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళతో కొద్దిసేపు గడపగలగాలి. స్కూల్ లో ఎం చెప్పారు ? ఎం నేర్చుకున్నా? అని అడిగి తెలుసుకోవాలి. కొన్నిరోజలకి వాళ్ళకే అలవాటై పోతుంది... మనం అడిగిన అడగకపోయినా వాళ్లే చెప్తారు. అలా అలవాటు చెయ్యడం వల్ల పిల్లలు ఏదైనా తప్పు చేసిన...మనం సరిదిద్దుకోగలం.

7-11సంవత్సరాల పిల్లల్ని ఫోన్ కి అలవాటు అవ్వనికూడదు, ఒక్కసారి అలవాటైతే వాళ్ళు తమ చేతి నుండి ఫోన్ ఇవ్వడానికి ఇష్టపడరు. బలవంతం గా మనం తీసుకుంటే వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. టీవీ లో కూర్టూన్స్ కూడా పిల్లల్ని చుడనివ్వకూడదు. అలా చూడటం వల్ల పిల్లలకి ఉన్న ఇమాజినేటివ్ పవర్ (ఊహ శక్తీ )తగ్గిపోతుంది. వాళ్ళు సొంతగా ఆలోచించే స్వభావాన్ని కోల్పోతారు జ్ఞాపక శక్తీ కూడా తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళు చదువుల్లో వెనుక పడే అవకాశం, ఉంటుంది.

to be continued in part-2


© Vinni🖤