...

20 views

బంధం
బంధం చాలా గొప్పది. ఏ బంధంలో అయిన చిన్న చిన్న గొడవలు సహజం. కానీ కొందరు ఎప్పుడు గొడవపడుతూనే ఉంటారు. అలా జరగకూడదు అంటే, బంధం లో ఉన్న ప్రతిఒక్కరు ఇలా ఉండాలి...
*ఒకరినొకరు అర్ధం చేసుకోగలగాలి..
*ఒకరి మాటను ఒకరు గౌరవించాలి, మాటకు వాల్యూ ఇవ్వాలి.
*భార్య భర్తల మధ్యలో, 3వ పర్సన్ ఎంట్రీ ఉండకూడదు, అలాంటి అవకాశం కూడా ఇవ్వకూడదు.
*ఒక ఆడపిల్ల పెళ్లికాక ముందు, తన ప్రపంచం అంత అమ్మ నాన్న. తనని ఒక యువరాణిలా చూసుకుంటారు.కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తాను కూడా తన తల్లిదండ్రులకు అంతే గౌరవ, మర్యాదలు ఇస్తుంది,ఆప్యాయంగా చూసుకుంటుంది.
*పెళ్లయ్యాక తన ప్రపంచం మొత్తం తన భర్త గానే భావిస్తుంది. భర్త, భార్య కి విలువ ఇస్తేనే, సమాజం లో కూడా తనకి విలువ ఉంటుంది.
*అత్త మామలు, కోడల్ని సొంత కూతురిలా భావించి, ప్రేమ అనురాగాలు పంచితే, ఆ ఇంటికి వచ్చిన కోడలు కూడా అత్త మామని తన తల్లిదండ్రుల భావించి సేవ చేస్తుంది. ఏ కుటుంబం అయితే ఇలా ఉంటుందో... ఆ కుటుంబం చాలా అందంగా ఉంటుంది. అందరూ ఇలానే ఉంటే మన ఇండియా లో వృధాశ్రమలు ఉండేవి కాదేమో కదా!!!!

Please comment your thoughts..

© Vinni🖤