...

14 views

అమ్మ నాన్నకు మించిన దైవం లేదు...
నా దృష్టిలో మా అమ్మ నాన్న నాకు దేవుడు దేవత.
అమ్మ నాన్న గొప్పతనం చెప్తున్నా ఒక పురాణ కధ....

శివుడు తన కుమారులు ఇద్దరికి పట్టాభిషేకం చెయ్యలి అని నిర్ణయించాడు. అందుకోసం వినాయకుడికి, కుమార స్వామికి ఒక పోటీ పెడతాడు. ఆ పోటీ ఏంటి అంటే ఎవరైతే విశ్వం మొత్తం తిరిగి, అన్ని దేవాలయలను దర్శనం చేసుకొని, ముందు ఎవరు వస్తారో వాళ్లే గెలిచినట్లు అని చెప్తారు ఆదిదంపతులు. అది వినగానే కుమారస్వామి తన వాహనం (నెమలి) మీద కూర్చుని ఫాస్ట్ గా వెళ్తు ఉంటాడు. వినాయకుడి వాహనం ఎలుక...వినాయకుడు తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు "నేను ఎంత ఫాస్ట్ గా వెళ్లిన మొత్తం తిరగలేను.... ఎం చెయ్యాలి" అని అలోచించి... వాళ్ళ అమ్మ నాన్న పాదాలకి నమస్కారించి వాళ్ళ చుట్టూ తిరుగుతాడు. కుమారస్వామి ఏ దేవాలయానికి వెళ్లిన,ఏ నదికి వెళ్లిన .... వినాయకుడే ముందు కనిపిస్తుఉంటాడు.చాలా ఆచార్యపోయి తిరిగి వచ్చి, నేనే ఓడిపోయాను... అన్నయ్య గెలిచాడు అని చెప్తాడు. కానీ నాకు ఒక సందేహం "నేను అంత వేగంగా వెళ్లిన కానీ వినాయకుడు ఎలా ముందు ఉన్నాడు" అని అడిగాడు. ఎందుకంటే ప్రపంచం లో ఉన్న అన్ని నదులలో మునిగినా, అన్ని దేవాలయాల చుట్టూ తిరిగిన తరువాత వచ్చే పుణ్యం, అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షణాలు చేసిన దానితో సమానం. అమ్మ నాన్న నీ మించిన దైవం లేదు...

కనిపించని దైవం కోసం వేతకు
కనిపించే దైవాలను విడవకు...

~ vinni ❣️