...

20 views

ఏమిటిది?
ఒక మనసు కథ...
అనుక్షణం తనని తలుచుకున్నపుడు నాకు అర్థముకాలేదు అస్సలు నా మనసుకి ఏం జరుగుతుందో…కనిపిస్తున్నా మామూలుగానే, కానీ ఏదో మార్పు బయటికి కనిపించేది మాత్రం కాదు…ఒక్కటి మాత్రం తెలిసింది నేను నాలా లేనని…నాలో ఎవరో ఉన్నారని, నేను వారిలో లీనమయ్యానని…
ఈ క్షణం నా అణువణువు తానే ఉన్నాడని అర్థమౌతుంది…
చాలా చిత్రంగా అనిపిస్తుంది ,నేనేనా అది తనకోసమేనా ,అలా పరితపిస్తున్నది అని…లోకం అంతా చాలా చిన్నదిగా కనిపించింది,కానీ చాలా విశాలమైనది,ఆ విశాల విశ్వంలో తాను ఈ చిన్ని కన్నులకు కనీసం ఒక మెరుపులానైనా కనిపిస్తాడేమో అన్న ఆశ.ఆహా!అద్భుతం..తాను కనిపించడు అని తెలిసినా చోట కూడా తన కోసం కనులు వెతికినప్పుడు నాకై నేనే పిచ్చితనమా అని అనిపించింది…ఎదో తెలియని ఆకర్షణ తన వైపుకు నన్ను లాగుతుంది అనుక్షణం తానే నా ఆలోచనలో కదలాడేలా చేస్తుంది.పని మీద ధ్యాస పోయింది,ఆకలి మీద ఆశ పోయింది
ఏమైపోతుంది అసలు తెలియట్లేదు.చాలా ప్రయత్నిస్తున్న ఈ ప్రపంచంలోకి రావాలని కానీ నా మనసు తన ప్రపంచంలో కనుమారుగైపోయింది.
ఇది ఏంటి? తెలియక పోయినా చాలా అద్భుతంగా ఉంది.ప్రతిక్షణం ఇలానే గడిపితే బాగుండు అనిపిస్తుంది.కానీ ఇది ఏంటి.కృష్ణుడి కోసం రాధ ఎదురుచూపుల్లా అనిపిస్తుంది అసలు ఇది ఏమిటి…
బహుశా ప్రేమేనేమో!!!

#love @Prathyu