...

3 views

ప్రేమ ప్రయాణం (తొలి పరిచయం) ఎపిసోడ్ 1
(రాజేష్ మరియు శివ తమ ఉద్యోగాల కోసం ముంబై కి ప్రయాణించనన్నారు. అందుకు వాళ్ళు హైదరాబాద్ నుంచి ముంబై కి వెళ్లే రైలు లో సెకండ్ క్లాస్ ఏ.సి భోగీని ముందుగానే బుక్ చేసారు. వాళ్ళు రేపటి ప్రయాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.)
(మరుసటి రోజు రాజేష్ మరియు శివ రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చే హడావిడి లో...............)

శివ : ఒరేయ్... రాజేష్ ట్రైన్ వచ్చేసింది త్వరగా రా.,..........
(రాజేష్ లగేజ్ మోస్తూ.......)

రాజేష్: ( అలసిపోతూ.......)ఆగురా మామ వస్తున్న.

(చివరికి ట్రైన్ వద్దకు చేరుకుని వాళ్ళ బోగీలోకి వెళ్ళారు. ట్రైన్ కదిలింది .)

(శివ మరియు రాజేష్ పరిగెత్తడం వ చాలా అలిసిపోయారు. చెమట పట్టడం వలన వల్ల బట్టలు తడిసిపోయాయి. ఇక సీట్ నెంబర్ వెతకడం ప్రారంభించారు. శీతాకాలం వల్ల సీట్లు కాస్త కాళిగా కనిపించాయి. రాజేష్ కిటికీ పక్కన , శివ రాజేష్ పక్కన కూర్చున్నాడు. రాజేష్ ఎదురుగా ఓ అమ్మాయి కిటికీ పక్కన కుర్చుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంది. తాను చూడటానికి చాలా అందంగా ఉంది. కళ్ళకు నల్ల కళ్ళజోడు వేసుకుని, నార్త్ ఇండియన్ కుర్తా వేసుకుని, రబ్బరు గాజుల వేసుకుని, కాళ్ళు మీద కాలు వేసుకుని ఎంతో హుందాగా,స్టైలిష్ గా కుర్చొని ఉంది.

( అలసిపోయిన రాజేష్, శివ లను చూసి...)

అమ్మాయి : ఏ పాని లెలో...
( అని హిందీలో మాట్లాడుతూ తన వాటర్ బాటిల్ ను వాళ్ళకు ఇస్తుంది.)
( రాజేష్ మొహమాటానికి వాటర్ బాటిల్ని తీసుకోలేదు. ఎందుకంటే తనకు అమ్మాయిలంటే తెలియని ఇబ్బంది. వాళ్ళ తో మాట్లాడటానికి కుడా ఇబ్బంది పడతాడు. కానీ శివ అలా కాదు.)
( కా ఎందుకో రాజేష్ కు ఆ అమ్మాయి చాలా నచ్చింది . రాజేష్ కే ఏంటి ఎవ్వరికైనా నచ్చాల్సిందే.....)

రాజేష్‌‌ : ఒరే ఆ అమ్మాయి ఏంటి హిందీలో మాట్లాడుతుంది ఆమే నార్త్ ఇండియనా.?
(....అని శివ చెవి లో రాజేష్ గుస గుసలాడాడు.)

శివ :ఆగురా ! అడిగి తెలుసుకుంటా. .
( ..అని రాజేష్ చెవి లో అన్నాడు...)

రాజేష్ : (ఓరొరె ఆగురా....)

శివ :మరి కాకపోతే. కామిడి కాకపోతే వాళ్ళ ఊసు మనకెందుకు రా.
(... అని తొందర తొందరగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.)

(శివ ఆ అమ్మాయికి వాటర్ బాటిల్ అందజేస్తూ........)
శివ: చాలా థాంక్స్ అండి.

అమ్మాయి: ఓ మీరు తెలుగు వారా. సారి అండి. చూడటానికి బొంబాయి వాళ్ళ లా కనిపించారు. అందుకే ‌నేనలా మాట్లాడాను. ఏమనుకోకండి .

శివ: ఏం పర్వాలేదుండి.

రాజేష్: ఒరే ఆ అమ్మాయి తెలుగు లో మాట్లాడుతుంది రా.......

శివ: తాను తెలుగు లో మాట్లాడితే నన్ను ఎం చేయమంటావ్.

రాజేష్ : అది కాదురా . ఆ అమ్మాయి తో మాట్లాడాలని ఉంది. ఇందుకు నువ్వు హేల్ప్ చెయ్యాలి. ఆమెను నాకు పరిచయం చెయ్యిరా.

శివ: నీలో ఈ ఏంగిల్ కూడా ఉందా. అరేయ్ మామా...! తను నా ఫ్రెండ్ఎట్రా పరిచయం చేయడానికి. లేదా సొంత అన్నాయ్యనా బావ నా. నువ్వు మరీ అంత మొహమాటపడకు మాట్లాడేయ్.

రాజేష్: అంతెనంటావా? .. కాని నాకు దైర్యం సరిపోవట్లేదు రా. నువ్వె ఎదోవకటి చెయ్యి.

శివ: నన్నొదిలేరా బాబు ఈ కలపడాలు మనవళ్ళ అయ్యే పనులు కావు నన్ను వదిలేయ్.

( అలా అంటూ న్యూస్ పేపర్ తీసి చదువుకుంటున్నాడు.)

( రాజేష్ కి ఏం చేయాలో తోచలేదు. ఆ అమ్మాయిని చూస్తూనే గంట గడిచిపోయింది. భోగీ లో. సీట్లు ఫిల్ అవుతున్నాయి చివరికి తాను తనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.)

రాజేష్: ‌ఏండి మీ దగ్గర చార్జార్ ఉందా....?

శివ : ఏరా ! ఇప్పుడు మాట్లాడాలనిపించిందా..
సరె మాట్లాడు.
(అని రాజేష్ చెవి లో అన్నాను)

రాజేష్ : ఆపరారే..... (శివ తో అన్నాడు.)

(తాను బ్యాగ్ లో నుండి చార్జర్ తీసి రాజేష్ కి ఇచ్చింది.)

( రాజేష్ చార్జింగ్ పెడుతూ...ఆ అమ్మాయి తో..)

రాజేష్ : థ్యాంక్స్ అండి. చార్జర్ తేవడం మర్చిపోయాను. ఇంతకి మీ పేరేంటండి?

అమ్మాయి: నా పేరు దీపిక . దీపికా పాండే. మరి మీ పేరేంటండి?
( అని రాజేష్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంది.)

రాజేష్: నా పేరు రాజేష్ అండి.
( దీపికా ఇంత వేగంగా పరిచయం అవుతుందని అనుకోలేదు. తాను తనతో ఇంత ఓపెన్ గా మాట్లాడతాదని అనుకోలేదు.)

రాజేష్: దీపికా గారు! మీరు ముంబై ఏ పని మీద వెళ్తున్నారు?

దీపికా: కిందట ఏడాది నేను ముంబైలో బీ.బీ.ఏ పూర్తి చేసా. ఇప్పుడు ఎం.బీ.ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయటం కోసం వెళ్తున్న. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు?

రాజేష్: దీపికా గారు. నేను నా ఉద్యోగం వదిలి నాలుగు నెలల అయ్యింది. ఇప్పుడు కొత్త ఉద్యోగం కోసం బొంబాయి కి వెళ్తున్న. జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వటానికి వెళ్తున్న.
( అరే రాజేష్ ఇవన్నీ ఎందుకు రా తనతో చెప్తున్నావ్ అని శివ రాజేష్ చెవి లో గుస గుసలాడాడు.)

దీపికా: ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసారు. అసలు ఏమైంది?

రాజేష్: అది దీపికా గారు....
‌‌ ( అని మాట్లాడుతుండగా......)

శివ: మామ భోజనానికి టైం అయ్యింది త్వరగా చేతులు కడుక్కుని రా. దీపికా గారు మీది భోజనం అయ్యిందా?

దీపికా: లేదండి ఇంక చెయ్యాలి. ముందు 'గారు' అనటం ఆపండి. నన్ను దీపికా అనే పిలవండి. సేట్...... మీ పేరు అడగటం మర్చిపోయాను.

( అలా. దీపికా వాళ్ళను పేర్లు అడిగే ముందే వాళ్ళు వాళ్ళ పేర్లను పరిచయం చెసుకున్నారు.)
(దీపికా వాళ్ళ తో కలిసిపోతూ భోజనం చేస్తుంది . వాళ్ళ విషయాలు తెలుసుకొని తన విషయాలు చెబుతు భొజనాన్ని ముగించుకుంటారు.)
( రాజేష్ ఉద్యోగం ఎందుకు వదిలేసాడు అన్నదాని పై తీవ్రమైన ఆసక్తి కలిగింది. ఈ ప్రశ్న అడగాలని ప్రయత్నిస్తుండగా........ )

( ఇంకా ఉంది......).
( ఈ ఎపిసోడ్ వచ్చినట్లైతే లైక్ మరియు కామెంట్స్ చెయ్యండి...)






© write now..