పౌర్ణమి
ఇదిగో అమ్మాయి..... ఇన్ని రోజులు ఏమైపోయావ్? ఇగో నీకో విషయం అడుగుతా ఇంతకీ నువ్వు పట్టుకుపోయిన నన్ను ని నాకు ఎప్పుడిస్తున్నావ్ రెండు సంవత్సరాలు అవుతుంది తెలుసా నువ్వు పట్టుకుపోయి.... అయినా నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతా ఎన్ని సంవత్సరాలు నన్ను నీ దగ్గర ఉంచావు కదా కనీసం ఒక్కసారైనా వాడిని వాడికి ఇచ్చేద్దాం అని అనిపించలేదా? ఏ ముహూర్తాన నీ కళ్ళు చూశానో తెలియదు గాని.... ఆ కళ్ళు నాకు ఎన్ని రాత్రులు కలలోకి వచ్చాయో నాకు మాత్రమే తెలుసు నీకు విషయం ఎవరైనా చెప్పారో చెప్పలేదు నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒక విషయం కచ్చితంగా చెప్పగలను ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఇప్పటివరకు నీలాంటి కళ్లగల పిల్లని నేను చూడలేదు, మరి నీ కళ్ళలో ఏ మాయ ఉందో ఏ మంత్రం ఉందో నాకు తెలియదు , అయితే నీకు ముందే చెప్పాను కదా మన పరిచయం రామాయణంలో రుక్మిణి కల్యాణమని...