ప్రేమ నీ మాయలో ❤️
అది ఒక నిండు పున్నమి రేయి. చుట్టూ సముద్రపు చల్లని గాలులు ఒక వైపు నీ అడుగులో అడుగు అయి నీ వేంట నేను వస్తాను అని ఊవ్వెత్తున్న పోటీగా ఎగసి పడే అలలు. బీచ్ లో ఒక వైపు ఎదో ఈవెంట్ జరుగుతుంది. వచ్చే వారితో వేళ్ళే వారితో చాలా సరదాగా కొలహాలంగా చిన్నా పేద్దా తేడా లేకుండా అందరూ సరదాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
అప్పుడే నేను అనుకోకుండా ఒక ఐస్క్రీమ్ స్టాల్ వైపు చూశాను. బ్లాక్ కలర్ పంజాబీ డ్రెస్ లో నుదుటి మీద చిన్నా వైట్ స్టోన్ స్టికర్ తో తన పొడవాటి కురులను చక్కగా ఒక చిన్నా క్లిప్ లో భందించి పేద్ద పేద్ద కళ్ళకి కాటుక పేట్టి ఆ జాబిల్లికి కూడ అసూయా కలిగించే అందంగా ఆ జాబిల్లి కన్నా ఎక్కువ ప్రకాశవంతగా వున్నా తన మోము ( ముఖం ) చూస్తే దివి నుంచి దిగి వచ్చిన దేవ కన్య లాగా మేరిసిపోయింది.
తనని ఒక్క క్షణం అలా చూసి నా గుండె లయ తప్పింది. తాను నా కోసమే అక్కడకి వచ్చిన అట్లుగా అక్కడ మేము తప్ప ఎవరు లేనట్లుగా అనిపించింది. ఇంక ఒక్క క్షణం కూడ అక్కడ ఉండకుండ తన దగ్గరకి వేళ్ళాను.
నిన్ను చూసిన క్షణం
నా ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆగిపోయింది.
నా చుట్టూ అంతా శూన్యం
అయిపోయింది.
ఎప్పుడు అయితే నీ కలువ
పువ్వు లాంటి నీ చూపు
నా మనసుని అల్లకొల్లాలు చేసింది.
నీ చంద్ర బింబం లాంటి నీ రూపాన్ని
చూసిన తరువాత
నా నాయనాలు నీ వైపు నుండి మరలానంటున్నాయి.
నిన్ను చూసిన క్షణం లోనే
నిన్ను నాలో నింపుకొని
నీ నిశ్చాస్వ నీ
నా ఉచ్చస్వ గా మార్చి
ఈ పంచ భూతల సాక్షిగా
నిన్ను నాలో సగ భాగం చేసుకోవాలి అని
నా మది ఊరకలు వేస్తుంది..
అన్న నా మాటలు పూర్తి కాకముందే నన్ను తట్టి లేపుతున్న తన చేతులు. తనని మొదటి సారి నేను చూసిన అప్పుడు నాకు కలిగిన అనుభూతులు నేను ధైర్యం చేసి చేప్పేలోపే. తానే నా ఇంటికి నా గుండెకి నా ఇష్ట సఖి లా మారిపోయింది.
నిజ జీవితంలో చేప్పక కలలో కూడ చేప్పలేక ఎప్పుడు చేప్పాలో తేలియక నాలో నేను సతమతం అవుతున్న సమయం లో అంతలోనే మసక వేలుతురు లోనే నా కళ్ళ ముందు కి కాఫీ కప్ తో వచ్చి నన్ను నిద్ర లేపేసింది. నా సఖి.
నా జీవితంలో తాను తీరం దాటిన కేరటం అవుతుంది అనుకున్న నాకు నా అదృష్టం బాగుండి ఎప్పటికి నన్ను వీడని నా జాబిలమ్మ లాగా నాతోనే వుంది.
@anjukrishna