...

15 views

హిందూ మతం గొప్పదా??? క్రైస్తవ మతం గొప్పదా???
part-2

*మొదటి ప్రశ్నలో

శివుడు కంటే శక్తీ స్వరూపుని పార్వతి దేవి...

శివుడి కి ఒక శాపం కూడా ఉంటుంది... అది ఏంటంటే ఒకరోజు సూర్యుడు శివుడి కి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది... సూర్య నువ్వు నీ శక్తీ తో విర్రవీగుతున్నావు.... నువ్వు నీ ప్రభావం కొంచం తగ్గించుకోవాలి అని శివుడు అంటాడు. నాకన్నా శక్తీవంతులు ఎవరు లేరు అనే గర్వం తో ఉంటాడు సూర్యుడు.. ఇంకా లాభం లేదని సూర్యుడి తలను ఖండించాడు. అది వెళ్లి భూమిమీద పడుతుంది... ఇది చూసి సూర్యుడి తండ్రి... ఆగ్రహంతో నువ్వు నా కొడుకును ఎలా అయితే ఖండించావో... నీకొడుకు ను కూడా అలా ఖండిస్తావు అని శపిస్తాడు. నేను శాశ్వతంగా ఖండించలేదు అని మళ్ళీ సూర్యుడికి పునర్జన్మనీ ఇస్తాడు....

ఆ శాపం వాళ్లే అయినా కనిపెట్టలేకపోతాడు.

తల ఉన్నప్పుడే... శివుడు మీద యుద్ధం చేసి చంపబోయాడు.....ఆ బాలుడి తలని ఖండించినప్పుడు అది చాలా కోపం తో కింద పడుతుంది... అంత ఆగ్రహంలో ఉన్న తలని పెడితే ఎవరిని బతకనివ్వడు అని ఉత్తరదిక్కులో ఉన్న తలను తెమ్మని చెప్తాడు.

ఆ తల తేవడానికి గల కారణం.... ఏనుగుకి విష్ణుదేవుడు ఇచ్చినా వరం...ఏనుగు తల పెట్టి పునర్జన్మనిస్తాడు శివుడు

* ఇంకా మన హనుమాన్ విషయానికి వస్తే ఆయనకి ముకోటిదేవతలు చాలా వరాలు ఇస్తారు కానీ ఒక ముని శాపం వల్ల వాటిని మార్చిపోతాడు.... అందుకే సీత విషయంలో జాంబవంతుడు హనుమంతుడి శక్తులు పొగిడి... గుర్తుచేసి... సీత జడ కోసం పంపుతారు... వాళ్లంతా ముందు మనలాగా సామాన్య మానవులు.. తరువాత దేవుళ్లవుతారు.. రాములవారు కూడా అన్ని విద్యలు నేర్చుకున్నారు కానీ ఆయనకి దైవ శక్తులు ఉండవు తరువాత వస్తాయి.

* సాయి బాబా ఒక మాములు మనిషి గా షిరిడి వస్తాడు... చనిపోయిన వారిని కూడా బతికించాడు.... తన శరీరంలో అన్ని భాగాలూ తీసి మళ్ళీ పెట్టుకున్న గొప్ప దేవుడు..

ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ గొప్పవారే....

మనకి మొత్తం నాలుగు యుగాలు

1) కృతయుగం (హరిచంద్రుడు )

2)త్రితయుగం (రాముడు )

3)ద్వాపరయుగం (కృషుడు )

4)కలియుగం ( మనం )

అలా ఒక్కొక యుగం లో ఒక దేవుడే అన్ని అవతారాలు ఎత్తాడు అని పెద్దలు చెప్తారు...

కృతయుగాన్నే సత్యయుగం అని కూడా అంటారు

అలా మా అన్నయ్య అడిగిన ప్రశ్నలే కాకుండా ఇంకా చాలా తెలుసుకున్న....

మతం కులం అని ఈరోజుల్లో ఉండకూడదు...

మా మతం గోప్ప, మా మతం గొప్ప అని అనుకోని కొట్టుకోవడం కన్నా... ఆ మతం లో ఉన్న సారాంశాన్ని ఆచరించండి చాలు.... అదే మీ మతానికి... మీ దేవుడికి నువ్వు ఇచ్చే గౌరవం... ❣️

~Vinni🖤