...

4 views

నా కథ పార్ట్ -1
Introduction:-

చిన్నప్పుడు మనం ఏం చేసినా ఎదో ఒక స్వచ్చమైన మనసు తో చేస్తూ ఉండేవాళ్ళం. అదేంటో ఎదుగుతూ ఉంటే మనలో మరొక రాక్షసుడు కూడా మనకు తెలియకుండానే పెరుగుతాడు వాడొకడు ఉన్నాడు అని మనకి కూడా తెలియదు వాడు బయటకు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇష్టమైన వస్తువులు దక్కనప్పుడు ఎదుటివాడు మోసం చేసినప్పుడు మనకు కావాలి అనుకున్నది వేరే వాళ్ళకి దక్కినప్పుడు ఇలా చాలా సందర్భాలలో బయట పడుతుంది maximum 100 కి 95% మనుషులు వారిలో ఉండే రాక్షసుడిని బయటకు రాకుండా కంట్రోల్ చేసుకునే శక్తి తోనే పుడతారు ఈ కంట్రోల్ చేసుకోవడం అనేది వారి యొక్క ఫ్యామిలీ పరిస్థితులు బట్టి చిన్నప్పటి నుండి వాళ్ళు పెరిగిన విధానం బట్టి maximum కంట్రోల్ లోనే ఉంటాడు కానీ ఈ 5 % ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రపంచానికి ఏదైనా మంచి చేయాలన్న వల్లే ఏదైనా చెడు చేయాలన్న వల్లే ఎందుకు అన్నాను అంటే ఎడిషన్ ఒక బల్బ్ కనిపెట్టడానికి 1000 సార్లు ప్రయత్నం చేశాడంట ఒక మామూలు మనిషి కి అది కచ్చితంగా సాధ్యం అయ్యే పని కాదు ఒక రాక్షసుడు మాత్రమే చెయ్యగలడు. ఇలా ప్రతి మనిషి లో ఒక రాక్షసుడు ఉంటాడు వాల్లే ఈ ప్రపంచాన్ని శాషిస్తు ఉంటారు అటువంటి మనుషులలో నుండి పుట్టిందే ఈ కథ.

Story:-

ఒక ఊరు మంచి పల్లెటూరు ఆ ఊరి చివర పాడుబడిన ఆ ఊరి సర్పంచ్ గారి ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చాలా కిరాతకంగా నరికి నరికి చంపుతూ ఉంటది.ఎంత దారుణంగా అంటే నరకం లో కూడా వాడు అంత శిక్షను అనుభవించడు అలా చంపుతుంది ఎందుకు అంత దారుణంగా చంపుతుంది ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి cut చేస్తే ఆ ఊరి సర్పంచ్ గారి అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది (ఆమె అందం ఏ కవి కూడా వర్ణించలేనిది ఆమె చాలా అందంగా ఉంటుందని తనకి తెలుసు ఆ ఊరి అబ్బాయిలు అంత తననే చూడాలి అని అనుకుంటుంది ఎప్పుడూ, ఆమె మాట్లాడే విధానం ఆమె వస్ర ధారణ చాలా అందం గా ఉంటుంది. చాలా మొండి అమ్మాయి.కావాలి అంటే అది ఎదైనా కావాల్సిందే.) సర్పంచ్ గారు ఎంతో మంచి మనిషి సాయం కోసం ఇంటికి ఎవరు వొచ్చిన లేదు కదూ కుదరదు అనే మాట లేకుండా ఎదో ఒక రకంగా సాయం చేసేవాడు ఆ ఊరి ప్రజలకు అతను అంటే ఎంతో గౌరవం, ఒక్కడికి తప్ప ఆయన మీద ఇప్పటికీ 5 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు రాజప్ప ఆయన్ని ఎలాగైనా ఓడించాలి సర్పంచ్ అవ్వాలి అనికోరిక కానీ రాజప్ప గురించి ఆ ఊరు మొత్తం తెలుసు. ఒకప్పుడు వాళ్ళ తాత 30 యేళ్లు ఆ ఊరిని ఏలాడు కానీ ఎప్పుడైతే ఆ ఊరికి మన రాఘవ రాజు గారు వచ్చారో అప్పటి నుండి ఆ ఊరిలో చాలా మార్పులు జరిగి చివరకి మన రాఘవ రాజు గారు సర్పంచ్ అయ్యారు. ఇప్పుడు ఆ ఊరు ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఏటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకి ఒక సారి ఆ ఊరి ప్రజలు ముత్యాలమ్మ జాతరను చాలా ఘనంగా నిర్వహిస్తారు భక్తులు ఎక్కడెక్కడి నుండో ఆ జాతరను చూడటానికి వస్తారు. జాతర మొదలైంది అంత హడావిడిగా ఉంది ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు ఇంతలో జాతరలో పెద్ద గొడవ మొదలైంది ప్రతి సంవత్సరం జరిగేది ఆ ఊరి ప్రజలకి అలాగే ఆ జాతరకు మిస్స్ అవ్వకుండా వచ్చే ప్రతి ఒక్కలకి ఆ గొడవ గురించి తెలుసు. కానీ కొత్తగా వచ్చిన మీకు తెల్వదు కదా ఒక 10 నిమిషాలు ఆగండి మీకు తెలుస్తది రక్తాలు కారిపోతున్నాయి తలకాయలు పగిలిపోతుంది ఎవరు అపట్లే అందరూ అలానే చూస్తూ ఉన్నారు..పార్ట్ - 2 LOADING
© Ajuyadav