...

3 views

❤️ ప్రేమ ఎంత మధురం ❤️
ఓపెన్ చేస్తే......

బృందావనం లాంటి ఒక పెద్ద మహల్
మహల్ పేరు కూడా "బృందావనం" మే

లోపలికి వెళ్తే...

నందన వనం నీ తలపించే గార్డెన్.అందులో రకరకాల పూల మొక్కలు,షో 🌲 మొక్కలు,పండ్ల మొక్కలు,కూరగాయల మొక్కలు,ప్రత్యేకంగా గోరింటాకు చెట్టు కూడా ఉంది.(ఆ ప్రత్యేకం ఎందుకో ముందు,ముందు స్టోరీ లోకి వెళ్తే తెలుస్తుంది.)

ఆ గార్డెన్ కి కొంచమ్ ముందు రాధ,కృష్ణుల విగ్రహం ఉంటుంది.
దానికి ముందు తులసి కోట.

హమ్మయ్య మహల్ బయట ఎలా ఉంటుంది చెప్పేశా.ఇప్పుడు ఇంటి లోపలకి వెళ్ళి చూద్దాం.రండి.....


ఎవరో పూజ చేస్తున్నారనుకుంట.గంట సౌండ్ వినిపిస్తుంది.గంట శబ్దం వినపపగానే గదుల్లో ఉన్న వాళ్ళు,ఇంట్లో పని వాళ్ళు అందరూ,పూజ గది ముందు హాజరయ్యారు.కానీ ఒక్కరూ తప్ప.

ఇక్కడ పని వాళ్ళని ఇంట్లో వాళ్ళలనే చూస్తారు.వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉంటారు.

ఆ పెద్దావిడ ఆ కృష్ణయ్య కి హారతి ఇచ్చి
తరువాత వరుసలో ఉన్న అందరికీ హారతి ఇస్తుంది.ఆ క్రమంలో ఆవిడకి అర్దం అవుతుంది.అక్కడికి ఒకరు మిసింగ్ అని,ఆ ఒకరు ఎవరో కూడా తెలిసింది.

ఆందరు హారతి తీసుకున్న తర్వాత ఎవరి పనులోకి వాళ్ళు వెళ్ళిపోతారు.

ఇంతకీ ఈ మహల్ ఎవరెవరు ఉంటునారో చూద్దాం.

ఆ మహల్ కి పెద్ద మహాలక్ష్మి గారు,ఆవిడకి ఇద్దరి కొడుకులు,పెద్ద కొడుకు పేరు అర్జున్,భార్య సుభద్ర వీళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆక్సిడెంట్ లో చనిపోయారు.(వీళ్ళ స్టోరీ తర్వాత రివిల్ అవుతుంది.వీళ్ళకి ఒకే ఒక్క కొడుకు అతనే మన హీరో ప్రస్తుతానికి ఇక్కడ లేడు)

చిన్న కొడుకు,సుధాకర్ భార్య పేరు లలిత,వీళ్ళకి ఇద్దరు పిల్లలు,ఒక కూతురు,ఒక కొకుకు.కూతురి పేరు లేఖ కొడుకు పేరు హర్ష వర్ధన్

ఇది ఈ మహల్ లో ఉన్న వాళ్ళ గురించి.ఆనంద్ గురించి ఇప్పుడప్పుడే రాదు.

మహాలక్ష్మి గారు అందరికి హారతి ఇచ్చి హారతి ప్లేట్ నీ పూజ మందిరం లో పెట్టీ హల్ లోకి వచ్చి సోఫా లో కూర్చుంటారు.

ఆవిడ కూర్చున్నదో లేదో టీ కప్ తో
ఆవిడ ఎదురుగా నిలబడుతుంది మణి
(వంట మనిషి).ఆవిడ కప్ తీసుకోగానే)
డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చొని ఉన్న లలితగారు మణి కి ఏదో సైగ చేస్తారు







అమ్మాయి గారు....అమ్మాయి గారు లేవండమ్మ..... బెడ్ మీద అడ్డదిడ్డంగా ముసుగుదన్ని నిద్రపోతున్న లేఖని నిద్ర లేపుతుంది మణి

నిద్ర మత్తులో ఏంటి మణి

అయ్యో అమ్మ మీరు ఈ రోజు మళ్ళీ ఉదయాన్నే లేవలేదు.మీ నాన్నమ్మ గారు మీ మీద కోపంగా ఉన్నారు.మర్చి పోయారా నిన్న చెప్పారు లేపు త్వరగా లేస్తాను అని.

ఆ మాట అనగానే టక్కున లేచి కూర్చొని,ఆ అవును కదూ....! అంతే ఈ రోజు మళ్ళీ బామ్మ చేతిలో అక్షింతలు తప్పవు.ఇప్పుడు నాని ఏం చేస్తుంది.

ఇప్పుడే టీ తాగి హల్ లో సోఫా లో కూర్చొని ఉన్నారు.మీరు త్వరగా రండి.
నేను నాకు తిట్లు తప్పవు.నేను పోతున్నా.అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోతుంది మణి.

మణి వెళ్ళగానే ఫస్ట్ గా బెడ్ దిగి బాత్ రూం లోకి దూరుతుంది లేఖ....


హెల్లొ ఫ్రెండ్స్ ఇది నా కొత్త  స్టోరీ. చెప్పెగా కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్న అని.
ఏదో కొత్తగా ట్రై చేశా.బాగుంది అనిపిస్తే
కంటిన్యూ చేస్తా.

ఇక పోతే మీ నుండి నాకు ఒక హెల్ప్ కావాలి.ఏంటంటే హీరోయిన్ ఫ్యామిలీకి నేమ్స్ కావలి.హీరోయిన్ అమ్మ,నాన్న,ఒక బామ్మ కారెక్టర్ వీళ్ళ ముగురికి కావాలి.మీకు అనిపించిన పేర్లు నాకు చెప్పండి.వీళ్ళకి పెట్టేద్దాం


© nikhil writing