...

13 views

క్యాసెట్ చెప్పిన కథ
#WritcoStoryChallenge
ఈ  వేసవి సెలవులకు ఎక్కడకు వెళ్తారు అని  తల్లితండ్రులు  వారి పిల్లల్ని అడుగగా , వారి పిల్లలు వాళ్ళ తో  తమ అవ్వ, తాతయ్య ఇంటికి వెళతామని నిశ్చయించుకుని వారి తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. వారి తల్లితండ్రులు వారి మాటకే సరే నని ,ఆ ఇద్దరి పిల్లల్ని బస్ లో ఎక్కిపించారు. వారు హాయిగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ అవ్వ తాతల వూరు కి వెళుతున్నారు. అంతలోపు వీరి తండ్రి( భాస్కర్) తన అత్త, మామ కు ఫోన్ చేసి ఇలా " ఆ ... మామా , మా ఇద్దరు అల్లరి పిడుగులు ఊరికి వస్తున్నారు, ఆ గుడి వద్దకు వచ్చి వారిని recieve చేసుకో, బస్సు ఎక్కించి దాదాపు అర గంట అయ్యింది " అని చెప్పాడు భాస్కర్.

"ఆ సరే.సరే..అల్లుడు , నేను దింపుకుంటాలే వాళ్ళని" అని అన్నాడు అతని మామ.

"ఇంకేంటి ఎలా ఉన్నారు ఇద్దరు..పొలం పనులు బానే చేసుకుంటున్నారా.." అని అడిగాడు భాస్కర్.

"ఏం.. పనులో ఎంగతో....మా ఇద్దరికీ వయసు అయిపోతోంది, చిన్నోడు బతుకుతుంటే ఈ పని మాకు తప్పేది..ఎం చేస్తాం, అంతా మా తలరాత, ఇంతకీ లక్ష్మి ఎలా ఉంది!" అని అన్నాడు మామ.

"ఆ తనకేం బాగుంది" అన్నాడు భాస్కర్.

"పిల్లలతో పాటు తనని కూడా పంపుంచుంటే బాగుండు అల్లుడూ..., ఓ వారం ఉండి వచ్చేది" అని అన్నాడు మామ  తన అల్లుడితో.

"ఎంటి...వారం రోజులా, అంతే ఇక, ఇంటి పని, వంట పని ఎవరు చేస్తారు మామ, నేను  రోజంతా  స్టోరీ లు రాసికే సరిపోతుంది , ఇక  ఒక్కన్ని అన్నీ పనులు  చూసుకోలే ను, తను ఒక్కరోజు ఇంటి లో  లేక పోతే ఏ పనులు  జరగవు" అని అన్నాడు భాస్కర్ తన మామతో.

"ఏం కథలో , ఎంటో , సరే ..అల్లుడూ నీ ఇష్టం, ఉంటాను పిల్లలు ఈ పాటికే వచ్చేసుంటారు" అని అన్నాడు మామ.

"సరే..ఉంటాను" అని ఫోన్ పెట్టేసాడు భాస్కర్.

        బస్సు దిగిన అల్లరి పిడుగులు వినాయకుని గుడి వద్ద కూర్చుని వున్నారు తమ తాత కోసం. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళని ,వాళ్ళ తాతనే గుడి వద్దకు వచ్చి పిలుచుకుని పోయేవాడు. అది వాళ్ళ అలవాటు అనుకోండి...
                ఇంతలో తాత ఆ ఇద్దరినీ పిలిచుకుపోవడానికి గుడి వద్దకు వచ్చాడు ఎద్దుల బండిలో.ఆ ఇద్దరు పిల్లలు సంబరంగా బండెక్కి కూర్చున్నారు.
"ఏమ్మా! లలితా...ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు చదువుతున్నది?" ,అని ప్రశ్నించాడు తాత.
"నాదా...ఇప్పుడు మూడు అయిపోయింది, నాలుగొవ క్లాస్ కి వెళ్తాను  సెలవలు అయిపోగానే" అని అంది.
"మరి..నువ్వేం చదువుతున్నావు రా లోహిత్ " అని అన్నాడు తాత.

" రెండవ క్లాస్ అయిపోయింది తాత" అని అన్నాడు లోహిత్.

              ఇలా వీరు మాట్లాడుకుంటూ తమ ఇంటికి చేరుకున్నారు.  పక్కనే వున్న పంపు లోంచి నీళ్ళు ఎప్పటికీ వస్తుంటాయి కదా , అక్కడే వారిద్దరూ కాళ్ళు, మొహం  కడుక్కుని ఇంట్లోకి వెళ్ళారు.వాళ్ళ అవ్వ వారితో కాసేపు ముచ్చటించింది. తరువాత వారికి  అన్నం పెట్టీ , కాసేపు వారితో కుశల ప్రశ్నలు వేసింది అవ్వ. ఇక పొలం పనులు ఉండడంతో ఆ ఇద్దరు పొలానికి వెళ్ళారు.
"ఇంటి వద్ద జాగ్రత్త లల్లి" అని చెప్పి ఆ ఇద్దరు ముసలి వాళ్ళు పొలం పనులకి వెళ్లిపోయారు.
ఇంట్లో వీరికి టీవి నే ప్రపంపచం అంతా...  jetix ఛానెల్ లో వచ్చే టీవి series అంటే వీళ్ళకి ప్రాణం. టీవి కి అతుక్కుపోయి వాళ్ళు వీళ్ళు. అలా వీళ్ళు టీవి ఇక ధాటిగా చూస్తూనే ఉంటారు మరి. ఇది ఇలా సాగుతుండగా ఆ ఊరికి  ఓ రోజు పెద్ద గాలీ, వాన లు వచ్చి వూరంతా కరెంట్  స్తంబాలు , పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయాయి. ఓ వారం వరకు కరెంట్  సరిగ్గా రాదని ఆ ఊరి  కరెంట్ పని
వాల్లు తెగేసి చెప్పారు. అలా వీళ్ళ టీవి కి ఆటంకం కలిగింది. ఒకటి రెండు రోజులు ఈ ఇద్దరు పిల్లలు వాళ్ళ అవ్వా,తాత తో పొలానికి వెళ్ళారు. అక్కడ వీరిద్దరికీ అస్సలు పొద్దు పోలేదు. ఆ మరుసటి రోజు నుండి వారిద్దరు ఇంటి వద్దనే వుంటామని చెప్పి అక్కడే వున్న బురద మట్టితో బొమ్మలు చేసుకుని ఆడుకునేవారు.అలా ఒకరోజు వీరికి ఏమీ పాలుపోక అటు ఇటూ తిరుగుతూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అలా వీరికి   వాళ్ళ ఇంటి ఆవరణలో వుండే ఒక పాత రూం ఒకటి తారస పడింది. ఇంకా చేతులు ఎక్కడ ఊరుకుంటాయి...వెంటనే ఆ గది తలుపుకి ఉన్న తాళాలను తెరవడానికి ఇంట్లో వున్న తాలాలన్ని  పట్టుకొచ్చాడు లోహిత్. ఇంకేం ఒకొక్క తాళం చెవిని తీసి ఎది open అవుతుందా అని చూస్తున్నారు. ఏదీ ఓపెన్ అవ్వట్లేదు. ఇక ఒక తాళం చెవి మాత్రమే మిగిలి ఉంది , ఈ సారి లలిత దాన్ని తీసుకుని ఓపెన్ చేయగా ,అది ఓపెన్ అయ్యింది. వాళ్లిద్దరూ సంబరంగా ఆ తాళం చెవిలను పక్కన పడేసి లోపలికి వెళ్లిపోయారు. అక్కడ వారికి చాలా వస్తువులు కనబ డ్డాయి. అయితే వారికి ఏ వస్తువూ నచ్చలేదు .మిగతా వస్తువులు ను గెలికి ,గెలుకి చూస్తున్నారు ఇద్దరు. అక్కడ వారికి ఒక క్యాసెట్ ల   box దొరికింది. వాటిని  వారు ఎప్పుడు చూడలేదు కదా..అందుకే అది వారికి వింతగా కనబడింది. దాన్ని గురుంచి  వాళ్ళు కేవలం బుక్  ల లో మాత్రమే చూసారు , చదివారు.బయట ఎప్పుడూ చూడలేదు కదా. వాటితో వాళ్ళు   అందులోని రీల్ నీ తీసి ఆడుకుంటున్నారు.
                సాయంత్రం అయ్యింది. ఇంటికొచ్చిన అవ్వా, తాత లు ఆ పాత రూం కి తాళాలు తెరిచిన విషయం తెలిసి ,ఆ రూం కి మళ్లీ తాళం వేసి అటువైపు వాళ్ళని  వెళ్లనియ్యకుండా అటు వైపు వెళ్తే దెయ్యం వస్తాది అని ,అటు వైపు ఇంకెప్పుడూ వెళ్లొద్దని చెప్పారు అవ్వా ,తాత ,ఆ ఇద్దరు పిల్లలతో. ఆ ఇద్దరు పిల్లలు  సెలవులు అయిపోయే వరకు అటువైపు వెళ్ళలేదు.  కొన్నాళ్లకు పిల్లలని ఇంటికి పిలుచుకు పోయేకి వాళ్ళ నాన్న( భాస్కర్)  ఆ ఊరుకి వచ్చాడు. ఇంట్లో పిల్లలు మాత్రమే ఆ cassette reels తో ఆడుకుంటున్నారు. ఇంకెవ్వరూ లేరు. ఇంట్లోకి వెళ్ళిన భాస్కర్ "రేయ్...లోహిత్ ఏంట్రా ఇల్లంతా గోల చేస్తున్నారా, ఎంటి ఆ పని ఆ reels అన్నీ అలా తీసి ఆడుకుంటున్నారు ఎంటి, అవ్వా తాత కోప్పడుతారు" అని అన్నాడు తన పిల్లలతో.
" ఏం లేదు నాన్నా , అవ్వ కూడా  ఏమీ అనలేదు మమ్మల్ని , అవ్వనే వీటితో ఆడుకోమంది" అని అన్నారు ఇద్దరు.
" సరే.  ఇక ఆడుకుంది చాలు కానీ , వెళ్లి  బట్టలు సర్దుకుని , స్నానం చేసి ready కండి రాత్రికి  మన ఊరు  కి వెళ్తున్నాం" అని అన్నాడు పిల్లలతో.
"అవ్వ రానీ, అవ్వ చెప్తే ఇంటికి వస్తాం!" అని అన్నారు ఇద్దరు పిల్లలు భాస్కర్ తో.
"రేయ్...ముందు ready కండి" అని గట్టిగా అన్నాడు భాస్కర్ పిల్లలతో.
ఆ ఇద్దరు పిల్లలు వెళ్లి వాళ్ళ బట్టలు ఎక్కడెక్కడ పెట్టుకున్నారో, వెతికి సర్దుకుంటున్నారు. ఆ పిల్లలు పీకి పడేసిన cassette  లను తిరిగి ఒక్కొక్కటి సరిచేసి అక్కడున్న cassette డబ్బాలో పెడుతున్నాడు. వాటిలో  అతనికి ఒక cassette పై ఒక వింత గుర్తు ఒకటి ఉంది .  దాన్ని నిశితంగా పరిశీలించే లోపు అతని అత్త, మామ లు ఇంటికొచ్చారు.

"ఎంటి అల్లుడు..చెప్పా పెట్టకుండా  వచ్చేశావు!"అని అన్నాడు.

" ఏం లేదు మామ, నాకూ ఇంట్లో  ఏం  పోవట్లేదు , ఏమైనా కొత్త కథ రాద్దామా అంటే ఒక్క idea లేదు, కాళీగా ఉన్నానని లక్ష్మి పిల్లలని తీసుకురమ్మని  నాకు చెప్పి పంపించింది" అని అన్నాడు.
"అది సరే..కానీ పిల్లలు  నీ అప్పుడే తీసుకుపోతాను అంటున్నావు ఎంటి అల్లుడు, ఇంకొన్నాల్లు ఇక్కడే వుంటారులే " అని అంది అత్త.
" అత్త మాట కాదనలేక  , తన భార్యకి ఒక సారి ఫోన్ చేసి  తన అత్త చేతికి ఫోన్ ఇచ్చాడు భాస్కర్.ఆ  తరువాత వారు ఏమేమి  మాట్లాడుకున్నారు ఏమో కానీ పిల్లల్ని అక్కడే పెట్టీ తన  ఊరికి పయనమయ్యాడు భాస్కర్ . ఇంటికి వస్తూ, వస్తూ తన వెంట ఆ cassette ను  కూడా పట్టుకొచ్చుకున్నాడు. ఆ రోజు ప్రయాణం చేసి  బాగా అలసిపోయిన భాస్కర్ ఇంటికొచ్చిన తరువాత ఫుల్ గా నిద్రపోయాడు.  ఆ మరుసటి రోజు ఉదయం ఆ క్యాసెట్ లో ఏముందని చెప్పి , తన వద్ద నున్న పాత రేడియో నీ బయటకు తీసి అందులో ఈ క్యాసెట్ నీ పెట్టాడు... అప్పుడు అందులో వచ్చిన పలుకులే ఈ కథ...
      
                       క్యాసెట్ చెప్పిన కథ

         "నా పేరు అభిరామ్. చేతాపల్లి గ్రామంలో పొలం  పనులు చేసుకునే ఓ సాధారణ కుర్రాన్ని. అమ్మా, నాన్న, నేను, అక్క ఇదే నా ప్రపంచం. అక్క కు వివాహం  ఘనంగా జరిపించాను. ఇక ఉన్న రెండు ఎకరాల భూమిలో వరి సాగు చేసుకుంటూ భతికేవాల్లం.  నాకు శ్రీ ,శ్రీ పుస్తకాలంటే చాలా ఇష్టం. 9 వ తరగతి వరకు చదుకున్న నేను పెద్ద చదువులకు వేరే  వూరికి అమ్మానాన్నలను వదిలేసి వెళ్ళలేక ఇక్కడే పొలం పని చేసుకుని బతికేవాన్ని. ఒక రోజు పండించిన ధాన్యాన్ని అమ్మడం  కోసం పక్కూరి కి వెళ్ళాం. ధాన్యం కొనేది  ఆ ఊరి పెద్ద  నే. ఆయన ఆ ఊరి సర్పంచ్ కూడాను.  అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన వద్దనే  ధాన్యాన్ని  అమ్మేవాల్లం. పల్లెలలో ఇది సాధారణం. అలా, ఒక రోజు ఆ వూళ్లో నాకు వింత ఆచారం కనబడింది. అది చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అదేంటంటే ఇంకా  ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో గర్భవతి లు  చనిపోతే వారి శవాన్ని కాల్చకుండా ఊరు చివరవున్న కొండపై అలా వదిలేసి వస్తారు ఆ శవాన్ని. ఈ విధమైన వింత చూసిన నాకే ఆశ్చర్యం వేసింది. ఇన్నేళ్లుగా ఇక్కడే  పెరిగాను కదా... మరి, ఈ విషయాలు నాకు ఎందుకు తెలీలేదు అని నాలో నేను వాదించుకున్నాను. చూసి పోయె వాన్ని ఇలాంటి సంఘటనలను. ఇలాంటి కార్యక్రమాలు చాలానే చూసిన నాకు ,వీటిని మార్చాలని చాలా ట్రై చేశాను. మూడ   నమ్మకాలతో  మా వూరి ప్రజలు నా మాట నమ్మలేదు.  అంతే కాదు, ఈ సంవత్సరం అమ్మా వారికి  జాతర చేయాలని ఊరి పెద్దలు తీర్మానం చేసుకున్నారు.  జాతర అంటే వూరికే అన్నం, పెరుగు పెట్టీ ఊరుకోరు కదా . అప్పుడప్పుడే పుట్టిన చిన్న మేక, పొట్టేలు పిల్లలని కూడా బలు పేరుతో చంపేస్తారు. అలా మేము పెంచుకునే మేక కు  రెండు మేక పిల్లలు పుట్టాయి. వాటిని అమ్మవారికి బలిచ్చేకి ఇవ్వాల్సిందే అని వూరంతా చాటింపు వేయించారు. మనం ఈ మేక పిల్లలను జాతరకు బలి  ఇచ్చేది లేదు అని  చెప్పినా వినిపించుకోలేదు మా వాళ్ళు. జనాల నమ్మకమే పెట్టుబడిగా అమ్మవారి జాతరలో అమ్మోరికి పొట్టెల్లు బలి ఇస్తే మంచి  జరుగుతుందని అని అన్నారు ఊరి పెద్దలు. అలా  ఆ రోజు  రానే వచ్చింది. ఈ రోజు  ఈ వూరి అమ్మవారికి జాతర చేసే రోజు.  అందుకు ఎవరికీ వారు తమ ,తమ బంధువులను ఇంటికి పిలుచుకుంటున్నారు . ఇక నేను కూడా అదే పని చేయలేక , మా అక్క, బావని ని పిలవలేదు. వాళ్లకు కు ఫోన్ చేసి ఇలా  ఇదంతా అనాగరికమని చెప్పాను.వాళ్ళు  నాకు సపోర్ట్ ఇచ్చారు . అందుకే వాళ్ళు  ఊరికి కూడా రాలేదు.  మా ఇంట్లో వాళ్ళు ఆ రెండు మేక పిల్లలను తీసుకొని అమ్మవారికి బలు ఇవ్వడానికి వెళ్లిపోయారు.  ఆ మేక పాపం 3నత భాధపదుతున్నాడో అని నా మనసు వేదన పడింది.  ఆ  రాత్రి నేను వుండే రూంలోకి కొందరు మనుషులు వచ్చి" ఇలాంటి సమాజ సేవ కార్యక్రమాలు వుంటే బయట చేసుకోమని, ఈ రోజు ఏదైనా మాళ్ళీ సమాజ కార్యక్రమం చేశావంటే చస్తావ్!" అని  బెదిరించి వెళ్ళారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది . పొట్టేలు బలిస్తే బలు లు  ఇచ్చారు , కానీ ఏమీ తెలియని, అమాయకులైన , నిరు పేద వర్గానికి చెందిన కొందరు  ఆడ పిల్లలను  నగ్నంగా నిలుచోబెట్టి , వార్కి పూజలు చేసి వూరంతా తిప్పి వారిని కూడా అమ్మా వారికి బలి ఇస్తారు. ఈ విషయం గుర్తుకు వచ్చిన  నేను  బహుశా ఇదే నా ఆఖరి రికార్డింగ్ ... ఈ అర్ధ రాత్రి సమయంలో  అక్కడికి వెలతున్నాను ఈ చర్యను ఆపడానికి....... ఇక తిరిగి వస్తానో లేదో " అని వుంది ఆ క్యాసెట్ లో.
                             అందులోని మాటలు   తన బావమరిది మాటలు అని గ్రహించిన భాస్కర్ ,తన బావమరిదిని ఆ ఊరి పెద్దలే చంపేశారని ఊహించాడు. ఈ క్యసెట్టు లోని మాటలను తన భార్యకు కూడా వినిపించాడు. ఆమె, ఆశ్చర్య పోయింది. ఇలా తన తమ్ముడు ఈ కారణంతో చనిపోయాడని బాధపడింది. కానీ, ఊరిలో తన తమ్ముడికి ' వేశ్యల పిచ్చోడు ' అని  వచ్చిన చెడ్డ పేరు పోగొట్టడానికి లక్ష్మి ఈ వాయిస్  నీ ఆధారం చేసు కొని  పోలీస్ లకు కంప్లైంట్ ఇద్దాం అంది తన భర్తతో. ఇంత దారుణానికి ఒడిగట్టిన  ఆ పెద్ద మనుషులు మీ అమ్మా నాన్న ను, మనలనీ  కూడా వదలరు. మీ తమ్ముడే ఇప్పుడు లేడు ,మనం ఇప్పుడు ఎంత చేసినా ఏం ప్రయోజనం అని అన్నాడు భాస్కర్. కనీసం , అందరికీ తెలిసే విధంగా  దీన్ని మీరు కథ గా రాయండి అని అంది లక్ష్మి. అందుకు ,సరే నని ఈ వాయిస్ నీ బేస్ చేసుకుని ,ఇంకొంత కథను add చేసి  ఒక కథను తన బావమరిది కి అంకితము ఇస్తూ అని రాశాడు. ఆ కథ చాలా బాగా అమ్ముడుపోయింది భాస్కర్ కి. ఆ  వచ్చిన పుస్తకాల డబ్బుతో తన బావమరిది పేరుతో  ప్రతి సంవత్సరం పేద పిల్లలకు బుక్ లు, పెన్లు, బ్యాగ్ లు దానం చేసేవాడు భాస్కర్.

      ఇదేనండి క్యాసెట్ చెప్పిన కథ.....