...

7 views

రక్త బంధం:2
Note:Read the 1st part of this story before reading this part
అలా శాంభవి ఒకరోజు ఒక ఇంట్లో పాలు పోసి
వస్తు ఇలా ఆలోచిస్తుంది నాన్న నన్ను ఎన్ని మాటలు అన్నా నన్ను పెంచిన తండ్రి నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే అది నాన్న వల్లే ఆయనకు పరోక్షంగా అయినా సహాయం చెయ్యాలి అని అనుకుంటూ వస్తుండగా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది రక్తపు మడుగులో ఒక అతను పడి ఉన్నాడు. ఎవరు అంబులెన్స్ కి ఫోన్ చేయకుండా చోద్యం చూస్తున్నారు. వెంటనే శాంభవి అతని జేబులో ఉన్న ఫోన్ తీసుకొని అంబులెన్స్ కి ఫోన్ చేసింది. ఆసుపత్రిలో అతనికి స్పృహ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసింది. నీది నాది రక్త బంధం కాదు అని ఎన్నేసి మాటలు అన్నా తండ్రికి పరోక్షంగా సహాయం చేస్తూనే ఉంది. ఒకరోజు రాజేంద్ర కి గుండెపోటు వచ్చింది వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు .గుండె చాలా దెబ్బతిన్నది రాజేంద్ర కు వెంటనే హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చెయ్యాలి అన్నారు డాక్టర్లు. కానీ రోజులు వెతికిన డోనర్ దొరకలేదు. రాజేంద్ర కుటుంబ సభ్యులది రక్త పరీక్ష చేస్తే రాజేంద్ర రక్తం శాంభవి రక్తం Aపాజిటివ్ అని అన్నారు డాక్టర్లు.ఆ విషయం తెలుసుకున్న శాంభవి ఒక్కక్షణం కూడా ఆలోచించలేదు. నేను నా గుండెను ఇస్తాను అని సిద్ధం అయ్యింది.
రాధా బాధపడింది. రాజేంద్రను ఆసుపత్రి లోపలికి తీసుకొస్తున్నప్పుడు, ఇంతకుముందు శాంభవి కాపాడిన వ్యక్తి స్ట్రక్చర్ మీద లోపలకి వెళ్తాడు. అతని చుట్టూ అతని కుటుంబ సభ్యులు అతని పిఏ ఇంకా కొంతమంది సెక్యూరిటీ వాళ్లు ఉన్నారు. అతను కొద్దిసేపట్లో చనిపోబోతున్నాడు. అతడు తన చివరి క్షణాల్లో కూడా శాంభవి గురించి తెలుసుకొని, తన అవయవాలను ముఖ్యంగా గుండెను శాంభవి కి అందించమని చెబుతాడు. శాంభవి గుండెను తన తండ్రికి అమర్చారు. శాంభవి చివరి క్షణాల్లో ఆ వ్యక్తి గుండె మళ్లీ శాంభవి కి ప్రాణం పోసింది. తనకు ప్రాణం పోసిన తన కూతురుని దగ్గరికి తీసుకుంటాడు రాజేంద్ర.

ఏ రక్తసంబంధం లేకున్నా ఎంత కోపాన్ని చూపించిన తిరిగి ప్రేమనే పంచింది శాంభవి.
అలా శాంభవి చేసిన ఒక్క త్యాగం పాతికేళ్లుగా తన తండ్రి మనసులోని కోపాన్ని తుడిపేసాయి. శాంభవి వహించిన ఓర్పు, సహనం ప్రేమను పంచే గుణం ఆమెను తన తండ్రికి దగ్గరయ్యేటు చేశాయి.
The End
-కొలాహలం విశిష్ట
© All Rights Reserved