...

11 views

అనాధబాలల దీనస్థితి😭
మన భారతదేశంలో 50% మంది పిల్లలకు అమ్మ,నాన్న అందరూ ఉన్నారు. మిగతా 50% మందిలో,అమ్మ నాన్న లేని వారు కొందరు అయితే, అమ్మ నాన్న విడిపోయి.. పిల్లలను వదిలేసినవారు ఇంకొంత మంది.
గుడిలో లెక్కలేనంత డబ్బులు హుండీలో వేస్తుంటారు, అవ్వనీ దేవుడు వచ్చి తీసుకెళ్తాడా??? దేవుడేమైన మిమల్ని, నాకు డబ్బు కావాలి అని అడిగాడా?? దేవుడు వరాలిస్తాడు అనేగా మనం గుడికి వెళ్లి,కోరికలు తీర్చు అని అడుగుతాం.... మరి అయినకెందుకండీ డబ్బులు?? ఆలా వృధా చేసే బదులు తినడానికి తిండి లేనివారికి, వేసుకోడానికి బట్టలు లేని వారికి ఉపయోగించండి, అప్పుడు వస్తుంది పుణ్యం.... దేవాలయల చుట్టూ తిరిగితే రాదు.
ఎవరైనా కొంత మంది నాయకలు ముందుకొచ్చి అలాంటి వారికీ దత్తత తీసుకొని, ప్రైవేట్ స్కూల్స్ లలో కాకపోయినా కనీసం గవర్నమెంట్ స్కూల్స్ లో అయిన చదివించి ఉంటే, ఇప్పుడు మన దేశంలో చాలా వరుకు పేదరికం పోయేది...
దయచేసి మీ స్వార్ధం మీరు చూసుకోవద్దు... అలాంటి పిల్లలకు సాయం చెయ్యండి, చదివించండి. మన దేశంలో కూడుకి,బట్టకి లోటు లేని రోజు ఒకటి రావాలి. ఆ పసిపిల్లల ఆవేదన పోవాలి.
చదువుకోవాల్సిన వయసులో పనులకు వెళ్తున్న బలాలేందరో???
తినడానికి తిండి లేక, వ్యర్థంగా పడేసిన ఆహారం తింటున్న వారెందరో???
అయినా కానీ మనసు చెలించని నాయకులెందరో???
విరాళాల పేరుతో డబ్బును, హుండీలో వేస్తున్న ధనికులెందరో??
సాయం చెయ్యాలని ఉన్న, చేయలేని మా లాంటి మధ్య తరగతి వాళ్ళెందరో??
అయినా కానీ మనసు కరగని వాళ్ళెందరో???
ఐ లవ్ మై ఇండియా అనడం కాదు... అలాంటి పిల్లల చెత ఐ లవ్ మై ఇండియా అనిపించండి.
మానవత్వం ఉన్న ప్రతిఒకరు అలాంటి పిల్లలకు సాయం చేస్తారు అని ఆశిస్తూ🙏🙏🙏🙏🙏....

~vinni🖤