...

2 Reads

కన్న వారు కంటికి రెప్పల కాపాడుతూ వస్తారు ఆడపిల్లని.
తప్పు ఒప్పులు ఉన్న సరి చేసి,మంచిని నేర్పిస్తారు.మొండిగా ఉంటారని భయం చూపిస్తారు.గాజుబొమ్మలా జాగ్రత్తగా చూస్తారు.
అమ్మ నాన్నలు అనవసరంగా కూడా ఒక్క మాట అనరు ఆడపిల్లని. సరియైన
దారిలో వెళ్ళడానికి మందలింపు చేస్తారు అది వారి హక్కు.

కానీ ఇతరులు అంటే బయటి వ్యక్తులు. ఆడపిల్ల గురించి ఏమీ తెలియని సమాజం ,ఏదొ విని ఏదొ అనేస్తూ నీచంగా మాటలు మాట్లాడుతుంటారు.
అనవసరమైన మాటలతో ఒక ఆడపిల్లని బాధ పెడితే, కన్నీళ్లు కార్చేల చేస్తే మాత్రం. దానికి కారణం నీవే అవుతావు. నీ నోటి మాట కర్మలకి బాధ్యత నీదే అవుతుంది కదా.

నీవు ఆడపిల్లని నీచంగా అనే మాటలు , వేషధారణ చూసి నీచంగా మాట్లాడుకునే మాటలు...
చివరికి అవి నిన్నే దహిస్తాయి....

అమ్మాయి అంటే ఆమెలో ఓ అమ్మని చూడాలి, సాక్షాత్ ఆ పరమేశ్వరినీ చూస్తున్నట్లుగా భావించాలి
గౌరవించాలి.

అంతే కానీ అసభ్యకరమైన మాటలతో వచ్చి పోయే వారిని పిచ్చి మాటలు మాట్లాడారు అంటే దానికి మీకు తప్పక శిక్ష పడాలి పడితిరాలి.

ఆ ప్లేస్ లో మీ అక్క నో చెల్లి నో ఉంటే కూడా అలానే మాట్లాడతారా....
మనిషి రూపంలో మృగాలంతా రోడ్డు పైన తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
.
.
ప్రతి అమ్మాయి ఏదిరించలేదు కానీ తప్పకుండా అలాంటి వారికి శిక్ష పడేలా కోర్కుంటుంది.
#ఆడపిల్ల