...

2 views

సీతాకోక నవ్వు
సీతాకోకే రంగులు పులుముతుంటే
ఆకాశమే హరివిల్లును పైటగా చేసి
నాట్యం పుట్టిస్తుంటే
పువ్వులే తేనెలొలుకుతూ
వర్షపు జల్లులు ఆకర్షిస్తుంటే
పసిడి వెన్నెల ఆనందమై
తాళం వేస్తూ రాగం పాడుతుంటే
ముసి ముసి నవ్వులు కురిపిస్తూ
వసంత ఋతువుల పులకింత
ఆమని రూపమై ఆయువును పోస్తుంటే
చేదిరేనా ఈ కనులు సంతోషంతో జీవితమంతా...
© Manju Preetham Kuntamukkala