...

6 views

శాంతి కపోతాన్నీ ఎగిరేద్దాం...🌷
గడ్డకట్టిన మంచుముక్కలతో సావాసం చేస్తున్న సైనికులను తల్చుకుంటూ
శాంతి కపోతాన్నీ ఎగిరేద్దాం...!!
వెన్నుకంటిన డొక్కలతో సాయం చేస్తున్న రైతన్నలకు వందనాలు చేస్తూ
మువ్వన్నెల జెంఢాని ఎగిరేద్దాం...!!
వందేమాతరమంటూ హిందూదేశాన్ని
ప్రపంచపటంలో అగ్రగామిగా నిలుపుదాం..!!
వేదాల సారాంశాన్ని వేనోళ్ల పాడేలా..
జనగణమననీ జనం ఎదనిండా నింపుదాం..!!
కులమతాలను కంచెలా వేసి కుతంత్రాలు చేసే కౌరవనేతలను..మరో కురుక్షేత్రం చేసైనా మార్చేద్దాం... !!
వందల బాషలొచ్చిన భారతమ్మ మౌనదీక్ష చేస్తుంటే..వదరుబోతులైన రక్కసులను ఉరితీయంగా ప్రతి ఒక్కరం ఉరితాడులోని పోగుగా మారిపోదాం...!!
ఎగిరేద్దాం శాంతికపోతాన్నీ...
ఎదిగేద్దాం నింగే హద్దుగా...!!
Happy independence day..🌷🌷