...

2 views

అమ్మ
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడున్నా నీ వెనుక ఎవరో ఉన్నారనే ధైర్యాన్ని కలిగిస్తుంది. నిన్ను అందరూ వద్ద్నుకున్నప్పుడు నీకు అండగా నేనున్నానని అడుగు ముందుకి వేస్తుంది.. నీకిక్కడ ఆకలి వేసినప్పుడు అక్కడ ఆమె పేగులో నీ ఆకలి తెలుసుకుంటుంది, వద్దు వద్దు అంటూనే నీకు నచ్చిన పనికి సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఎదిగితే సంతోషిస్తుంది, ఓడితే ఒడార్పవుతుంది.. కష్టపెట్టినా ఇష్టంగానే భరిస్తుంది. నష్టాలను చేకూర్చినా భయపడక నిన్ను గెలిచెంత వరకు ప్రోత్సహిస్తుంది..కుటుంబం అంతటిని ఒక్కటి చేర్చి అనుబంధాల ఇంటిని నిర్మిస్తుంది, దానికి దేవాలయమంత విలువని సాధించి పెడుతుంది. ఆమె అమ్మ, దేవుడు తను చేయలేని ప్రతి పనిని ఆమె బిడ్డకు చేస్తుంది. అమ్మను మించి దైవం లేదు. అమ్మ ను మించి ఆనందం లేదు. మనం అమ్మను ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూద్దాం ఒక్క మథర్స్ డే రోజే కాదు 24/7 & 365 రోజులు
© director.gopikiran