...

1 views

అందాల రాణి
ఢిల్లీ కి రాణీ అయినా తల్లికి బిడ్డే. తల్లి హృదయం ముక్కలైనా ప్రతీముక్కలో బిడ్డ పూర్తిగా ఉంటుంది. గాఢ నిద్రనైనా కంటికి దూరంగ పారద్రోలి కంటిరెప్పల్లో దాచుకుంటుంది మనసున్న మహారాణిగా చూసుకుంటుంది తన బిడ్డని. తన బిడ్డ ఎలాగుంటే నేమి తన కళ్ళతో మహారాణిగానే తిలకిస్తుంది. జీవిస్తుంది తన కోసమే దేవిగా భావించ చిన్న చిన్న పలుకులు విని తనువంతా పులకించి బిడ్డకు గాయమైతే తన శరీరాని కైన భాధ బిడ్డకు ముల్లుగృచ్చితే తన గుండెలో గునపాలు దిగినట్లు ఫీలవుతుంది. నిరీక్షించాను నీకై నే ఎదురు చూసిందినీకై కనులలో వెదికాను కలల మధ్య తెరిచిన కనుల ముందు కనిపించింది అందాలరూపం అచ్చం పోలిక అందాలరాణి వే నాబిడ్డ... కడుపులో పుట్టిన పట్టపు రాణి కేం తక్కువ మనసున్న తల్లి మహారాణి ఉండగా ...
పద్మిని బూర "సంపంగి"✍️