...

8 views

తేనె పూసిన ఖడ్గం..............
తనకు తెలుసు,
తనదేదీ తన నుంచి,
దూరం కాదని,

తను బాగా అర్థం చేసుకుంది....
తాను పొందాలనుకున్నది
తనకెప్పటికీ చెందదని.........

కానీ ఎందుకో ఆరని ఆశ...
తీరని...... ఊహ.........
తెలీని, ఆరాటం, నిసృహ,
వెంటాడు తున్న.. ప్రేమ......


కనులు కోరిందల్లా తెచ్చుకొంటే
ఏమి మిగులు తుంది ఈ జగత్తు లో
వీచే గాలిలో అతని శ్వాసను,
కురిసే వానలో అతని....... కన్నీటిని,

ఎముకలు కొరికే చలి కాలంలో
వాడి తీపి జ్ఞాపకాలు,
మండు వేసవిలో అతగాడి.......
ఊపిరి సెగలు,

తను గుర్తుకు తెచ్చుకుంటోంది,
లేదు తనుగుర్తించు కుంటోంది........

మరుసటి తరానికి,
ముందు కాలానికి......

ప్రేమ
అంత గాఢమైనదని తెలీదు పాపం....

ఎవరేమనుకున్నా.........
తనకు తన ప్రేమే ముఖ్యం,

సెలయేరు లా తనను తాను
ఏమార్చు కోవాలన్నదే
తన అంతిమ లక్ష్యం........
అలా చేస్తే ప్రియున్ని
తొందరగా చేరుకోవచ్చన్న ఆశ
తనది........

ఆ స్వరం వింటేనే చాలు
సిగ్గు మొగ్గలు వేసేంతగా
తను అతడి మాయలో
నిండి ఉంది........

.....
.......
...
........
అయినా
తన ప్రేమను తన రెండు కళ్లలోనే
దాచేసుకుంది.......
కారణం........
తను
ఎప్పటికీ
అతని ని కలవక పోవడమే........

దూరాలు వేరైనా దారి ఒక్కటే
అనుకుంటూ.....
ఉబికే అశ్రువుల నాపుకుంటూ,
తేనే పూసిన,
ప్రేమ ఖడ్గం గుండెల్లో దిగుతూ ఉంటే....

బాధను పంటి బిగువున కప్పేస్తూ,
ఎదురుగా ఉన్న అతనితో
సరిగ్గా.... మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.... తను.....


ఏమో తెలియదు కానీ రెండూ హృదయాల్లో నిలిచిపోయిన నిశ్శబ్దం....
మాట్లాడుకోవా,
పోట్లాడుకోవా,
అని
ప్రకృతి...
నక్కి,నక్కి, ఇద్దరిని గమనిస్తోంది.....

చూడటానికి ఏముంది... శరీరం మే
కదా అన్నట్టు.... వారి కళ్ళు... ఒకరి నొకరు అసహ్యించుకుంటున్నాయి.....

రెండు మనసులు విడిపోతూ ఉంటే,
సృష్టి చీలిన భావన, చీకట్లు కమ్మి... ,
లోకమంతా... అందకారమయింది...

కాలం రాకాసి లా నవ్వుతూ ఉంటే
అవని, సూరజ్ లు ఎవరీ వెహికిల్ లో
వారు ఇంటికి వెళ్ళి పోయారు........
..................by............ govind@.......















© All Rights Reserved