...

15 views

అనాధబాలల ఆవేదన...
మనదేశంలో ఉన్నారు ఎందరో అనాధబాలలు
ఆ బాలలు కంటారు ఎన్నో కలలు
అవ్వనీ కళ్ళు తెరవంగానే కలలు
వారికీ దూరం అయ్యారు అమ్మానాన్నలు

చేత బూనినారు చిన్న చిన్న సంచులు
తిరిగి తిరిగి అలసినారు సంధులు గొందులు
వారికీ జబ్బువస్తే ఇచ్చేవారు ఎవరు మందులు??
ప్రతికల్లో చూస్తుంటాం ఎటువంటి వందలు వేలు.....

పలక బలపం పెట్టాల్సిన ఈ పసిమొగ్గలు
మండుటెండల్లో కములుతున్నాయి వారి బుజ్జిబుగ్గలు..
వారి గొంతు తడుపుతున్నాయి బజారు పంపులు
ఆశ్రయమిస్తున్నాయి మనం నడుస్తున్న ప్లాట్ఫారాలు..

విధిలేక తాకట్టు పెడుతున్నారు వారి ఆరోగ్యాలు..
ఎప్పటికందేను వారికీ మంచి సౌకర్యాలు..
దివినుంచి దిగిరావాల్సిన పనిలేదు దేవదూతలు
మన ఆలోచనలు మారితే వారికీ తగ్గెను వాతలు...

వీరికి లేవు ఎటువంటి కులాలు మతాలు
సహకరిదాం మారడానికి వారి జీవితాలు
నీవు చేస్తే చాలు ఈ చిన్న మేలు
వారు పలుకుతారు నీకు తరతరాలు జైజైలు...

అనాధబాలలకు
సహకరించడానికి ముందుకువద్దాం
దేశ అభివృద్ధికి ముందడుగు వేయిద్దాం...



© Vinni🖤