...

7 views

నేను వెళుతున్న... నేను అడుగుతున్నాను
కోపాగ్రహలకు కృంగిపోతు
కుల కుతంత్రాలతో క్రూరంగా కళ్లు మూసుకుపోయి
మానవత్వం మసకబారిన
మనసు మాసిపోయిన
ఆవేశం అర్థం కాక స్వార్థంతో ఆలోచించి
ఆక్రోశంతో అయినవారిని కాదనుకొని
అభివృద్ధి అన్న అబద్ధంలో అరచకాలను అణగారిస్తున్న ఈ సమాజానికి సమాధానం కోసం
నేను అడుగుతున్నా...
నేను వెళుతున్న...

ఆకలి దపులతో అలమట్టించి
ఎండలకు ఎండి ఎముకల అస్థిపంజరం గా మారి పోయిన మూగ్గజీవుల మాటల ఆర్తనాదాని విని చలనం లేని మనుషులు మనసుని కదిలిచేలా,
కరిగేలా,
మారేలా,
మర్చెలా ,
నేను వెళ్తున్నా..
నేను అడుగుతున్నా...

కుటిరాలను కూల్చేస్తు
కళలను కాల్చేస్తు
గమ్యాన్ని మారుస్తు
గమనాని మార్చెస్తు
భయబ్రాతులలో గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశాంతంగా పడుకున్న రోజే లేదు
దోపిడీ దగా దారుణాలతో రోజు గదుపుతున్నా ..
గతిమారలేదు రీతి రావడంలేదు

పాలించాల్సిన ప్రభుత్వమే
కక్షతో క్రూరంగా రక్తం తాగుతంటే
న్యాయం చెపాల్సిన న్యాయస్తానం
నానా అనర్థలకు పాలుపడుతుంటే
ప్రాణాలను కాపాడాల్సిన అసుపత్రులు అంత్యక్రియలు చేస్తుంటే
రక్షించాల్సిన పోలీసులు
రాజ్యాంగం నుంచి తపించుకుంటుంటే
ప్రజలకోసం పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటు
ఇవ్వాల్సిన నిధులను దాచుకుంటు
పేదరికాన్ని ఇంకా పేదరికంలో కి తొకేస్తుంటే
ప్రశ్నించిన వారికి సమాధానం కోసం

నేను వెళ్తున్నా..
నేను అడుగుతున్నా..

పారిశ్రామిక వర్గాలు ప్రపంచాన్ని పాలిస్తున్నాయి
అణుబాంబులు ఆపేస్తునాయి
అణగారిపోయిన జీవితాలను
అట్టడుగున పడివేస్తుంటే
ఆవేశాని ఆపుకోలేక
ఆక్రోషానికి ఆనకట్ట వెయలేక
ఆక్రందనలకు గురవుతు
సమాధానాని వెతకడానికి
నేను వెళ్తున్నా...
నేను అడుగుతున్నా
© Anitha