...

3 views

జ్ఞాన్వి సఖ
దివి నుంచి జాలువారిన జాబిలి సోయగం
కనులను సైతం కనువిందు చేసి
మనసును కట్టిపడేస్తున్న వేళ
తల తల మిరుమిట్లుగొలిపే తారల్లా
ఆకాశవీధిలో ఆడుతున్న గొల్లభామలు
గోవిందా గోవిందా యని గానం చేస్తుంటే
గల గల పారే సెలయేరు ఒడ్డున నిలిచి
మనసారా వేణువూది పిలిచితివే
ఘనశ్యామా జ్ఞాన్విసఖ
© Gnanvi