...

2 views

అనామిక....
తీయని తేనె పలుకులు పలికే చిన్నారి,
విశాల గగనం వైపు ఆసక్తి గా చూస్తూ ఉంది...

తనకు తెలుసు.. తన తల్లి మళ్ళీ వస్తుందని... ఆశగా, ఆనందంగా అటే చూస్తూ ఉంది...
తన నవ్వుల పువ్వులు,
అల్లరిపనులూ,
చూచి తన తల్లి,
కసరటం ఆమె చూడాలి,

వెచ్చని ఒడిలో నిద్రపుచ్చుతూ సాహస
కథలెన్నో చెప్పుకు పోవాలి...
తనని అల్లుకొనాలి....

చందమామ ను చూపి జోల పాడి,
తనని అలరించాలి...

పసి బుగ్గలు అదిరేలా లాలించే అమ్మ కోసం తను ఆకాశం వైపు చూస్తూ ఉంది..

చింపిరి జుట్టు పెట్టుకుని,వాడిపోయిన ముఖం తో, దీనంగా, భారంగా, ఎదురు చూస్తూ ఉంది...

మనసు ఆరాటపడుతూ ఉంటే తాను అమ్మ ఏదని ఎక్కడని నలు దిక్కుల ప్రశ్నిస్తోంది...

పారేటి సెలయేరు,
కూసే కోయిల,
ఆడే నెమలీ,
మెరిసే జాబిల్లి...
మీరైనా చెప్పండమ్మా..

మా అమ్మ ఎక్కడుందో అంటూ తల కిందకు దించి అనుకుంది..

ఇంతలో, ఇంతలో, వాన మొదలైంది...
ఆ చిన్నారి మనసు కురవసాగింది...

© గోవింద్ @...