...

0 views

పోరాటం
నిరంతర పోరాటమే జీవితం రోజుకో యుద్ధం బ్రతుకే పోరాటం ఒకపోరాటం ముగిసేలోపు మరొకటి సిద్ధం. వెనుకంజ వేయకుండా పోరాడుతూ. సాగిపోవడమే జీవితం. తల్లి జీవితంతో పోరాడుతూ పాపకు జన్మనిస్తుంది. అదే పాపకు మద్దతు అంటూ తాను కూడా పిడికిలితో జన్మించి లోకంతో పోరాడతానని అడిగిన నాకు నా పిడికిలి పోరాటానికి సిద్ధం అని చెప్పకనే చెబుతూ.. సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి పోరాటమే.. పోరాటమే జీవితం, పుట్టిన పాప ఏడుపుతో పోరాడి సాగించుకుంటుంది, అపుడే అమ్మ పాలు పడుతుంది.. నాలుగు మెతుకులు కలిపి నోట్లో ముద్ద ఎవరు పెట్టారు, ఆకలవుతుందంటే నే అమ్మ అన్నంపెడుతుంది.. ఇది మొదలు పోరాటానికి నాంది.. ప్రాణులు అంటే జీవం, జీవమంటే పోరు ఒంటరి పోరాటం ... సంపంగి బూర✍️