...

6 views

పువ్వునీ వీడని గంధమల్లే...💓✍️
ప్రియమైన రాముగారికీ...
నీ సీత ప్రేమతో రాయు ప్రేమలేఖ..
ఏమండోయ్..శ్రీవారు
పిలిచినా పలుకని నీ హృదయమందునా...నా మూగ ప్రేమనంతా దాచుంచానేమో మరీ...
ఎంత వెతికిన పదాలకు దొరకనంటూ పదిలంగా దాటేస్తున్నాయి ఊసులు...!!
అదేంటోనండీ...
ఊహలెంత తీయనివో...
పువ్వులను వీడనంటున్న గంధములా నా ఎదను వదలట్లేదుగా...!!
రాముగారు...నాకలం ముఖాన
ఎందుకో ఓ అలజడి... అలలను రాయబారానికీ పంపి ఆ సంద్రం ఆశగా చూస్తున్నదా అన్నట్లు...
నా ప్రతి పదం..నీ కనులకుచిక్కి విలవిలాడుతున్న వేళ...
ఒక్క మాట చెప్పలేవా...
నీ మదిలో నేనున్నానంటూ...
నీ ప్రతి పనిలో నేనున్నానంటూ...!!

ఏమండోయ్.. అలా ఘాటుగా చూడక
ఒక్క నవ్వునే రువ్వరాదా...
చీకటి రాకాసిని చిధ్రం చేసే శరాఘాతమై...
నా పెదాల వాకిట్లో పారిజాతంలా వికసిస్తుందీ..!!
ఇక ఉండాలనిపించకున్నా...
మీ ఓపిక నీ పరీక్షించగలనా..మరీ..
అందుకే...
మరో లేఖతో సిద్దమవుతూ...
ఇట్లు..
ప్రేమతో.. నీ సీత...💓✍️