...

6 views

పువ్వులో పుట్టిన తేనేనై..✍️
@సీతారామం..
ప్రియమైన రామ్ కీ..
తడిచిన కన్నులను తడిమిచూస్తున్న నీ రూపమే స్వప్నమవగా...
నా ప్రతి కలను వెంటాడే కథవీ నీవే కదా...
రామ్ గారు...మీరలా నా వెనుకే ఉండి నన్ను నడిపిస్తున్నారనుకుంటా...
ఈ ఒంటరి పరుగు విసుగురాకుండా...!!
ఏమోనండోయ్.. నా కలం..నా బలములను శాసిస్తున్న నీ ఆలోచనలే ఆయువుగా మారి...
కొడిగట్టిన దీపములా జ్వలిస్తున్నా..నా దారిని నేనే వెతికేస్తూ నిను చేరాలనే తపనతో..!!
మనసేమో సీతాకోకచిలుకలా ఎగురుతుంటే... నిజమేమో గొఃగళిపురుగులా కదులుతుందీ...
దేనికైనా సమయము రావాలంటూ..!!
సరేలెండి రామ్ గారు...సరదాగా మీకు కబుర్లు చెప్పేయాలంటూ ఈ సాయంకాలం ఆ సూరీడిని సాయమడిగా...వెళ్తువెళ్తూ సందెవాకిట్లో వెన్నెలదీపం పెట్టేసాడు మనకోసం..!!
అంతే కాదండోయ్ రామ్ గారు..
ఆ వానచినుకు మీ నవ్వులకులుకును అద్దుకుందేమో..తొలకరిలా నన్ను చేరి తొందరపెట్టేస్తుంది..ఆమనిలా మారిపొమ్మనీ...!!
ఈ పూటకి అక్షరాలనీ వారధి చేసి నా ఆనవాళును అచ్చేసా...అందంగా పువ్వులో పుట్టిన తేనేనీ స్పురిస్తూ....
నేను నీ చెంతలేని లోటును పూరిస్తూ...
ఇట్లు...
ప్రేమతో నీ సీత...💓✍️
© Rajani Reddy