...

1 views

" అతని ప్రేమ ! "
ఇన్నేళ్ళు వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన దూరం తర్వాత...

చివరికి ఆమె అతడికి అత్యంత దగ్గరగా ఎదురుపడింది...

ఎన్నాళ్లగానో అతని గుండె లోతుల్లో పెంచుకున్న ప్రేమను

అతని కళ్ళతో బయట పెట్టాలనుకున్నాడు...



కానీ,

ఆమె కాళ్ళకున్న మెట్టెలు ,

ఆమె మెడలోనున్న తాలి ,

ఆమె నుదుటునున్న బొట్టు చూసి...



ఆ ప్రేమను అతని గుండెల్లో సమాధి చేయలేక ,

పునాదిలా ఏర్పడుతున్న బాధను బయటపెట్టలేక ,

పైకి మాత్రం పెదాలతో నవ్వుతూ కనిపించాడు.



బహుశా అతను కూడా ఊహించుండడేమో...?

అతని ప్రేమకు కాలమే ఓ పెద్ద శత్రువని !

-mr.satya's_writings✍️✍️✍️


© @mr.satya's_writings