...

1 views

త్రిగుణ సంపన్న... ప్రాణమున్న బ్రహ్మన్న..!!
సేవా, సహనం, త్యాగం
కవచకుండలాలు నీకు ఓ త్రిగుణ సంపన్న...!!

పోతున్న ప్రాణానికి సంజీవనిగా మారి
మరల ఊపిరిలూదే ఓ బ్రహ్మన్న...!!

ఒంటిని సలిపే నొప్పి బాధని తుడిచేసే
వందల వైపర్లు నీ అరచేతిన ..!!

మల్లెల రంగు వస్త్రాలు మేనినీ తాకితే
మహిమలన్నీ చేరునట మమతల మాటన...!!

ధన్వంతరి శిష్యులట... ధనుస్సు పట్టని వీరులట...
వైద్యం చేసి వందల ప్రాణాలను కాపాడే బాధ్యతన...!!

తాము నవ్వితే రోగి బాధ సగం తగ్గిపోయేనట
కులమత..తమపర బేధం చూపని వ్యక్తిత్వమున...!!

కాటికి పోయే ప్రాణంకీ చేతులు అడ్డేసిన దైవమేనా...
మెడన స్టెతస్కోప్‌తో కనిపించే కన్నయ్యనా...!!

ప్రతిరోజూ ఎంతో మంది బాధలను తగ్గించి
ఆరోగ్యం ప్రసాదించే ఓ వైద్యన్న...
అలాంటి అరుదైన మీకు
హృదయపూర్వక వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు ...🙏💐