...

0 views

జీవన పోరాటం
జీవన్మరణ పోరాటంలో కోరిక దహిస్తే
మనలోని ఓపిక సహించదు
సరికదా బరించదు..
జీవితం ఎలా మొదలు పెట్టాం
అన్నాదానికంటే
ముగింపు ఎలా ఇచ్చావన్నదే ముఖ్యం. నలుగురు పై పై చూపులకు మెచ్చుకోలిడినా ఆనటన కంటే ఇతరులు
నీపట్ల చూపించే నిజస్వభావం మిన్నా.
వారు నాకు ఏమిచేశారు అనిఆలోచించక నేను వారికి ఏమి చేశాను అనేది యోచించు.. ఒకరి కాళ్ళ దగ్గర బ్రతికే ప్రాణమున్న శవంకాకు, ఊపిరి ఉన్నంతకాలం ఊగిసలాడే ఊహలతో కన్నీటిని జాలువార్చకు. మరిగే రక్తం నీ ఒంట్లో ఉన్నంతవరకు అన్యాయాన్ని ఎదిరించి నీలోని పోరాట పటిమను చూయించి నీదంటూ ఉన్న ఉనికిని చాటుకో.. ఒకరి ముందు చేతులెట్టుకొని నిలబడడం కాదు జీవనం అంటే కట్టుబాట్ల దాస్య శృంఖలాలు తెంపు, ప్రకృతిలో పక్షులు,జంతువులు సమస్త జీవాలు జీవిస్తాయి.కానీ ప్రత్యేకత కేవలం మానవజాతికే ఒసంగింది ప్రకృతి..
సమతను చాటు,గరీబీని హటాయించు..
అక్షర జ్ఞానాన్ని అందరిలో పంచు,యేఒక్కరూ దీనికి వంచితులు కాకూడదు ఎందరో సంఘసంస్కర్తలు పోరాడారు, వారి మార్గమే నీ పోరాటం, నీ విజయపతాకాన్ని గగన వీధుల్లో ఎగురవేయి అదే జీవన పోరాటం ...
సంపంగి బూర✍️