...

2 views

ఓయ్ నిన్నే...
ఎప్పటికే నాకై నడవని నీ అడుగులలో ఆగిపోతానంటున్న నా గుండె వైపు ఓసారి నీకంటే ముందే తెలుసుకున్న నీ జ్ఞాపకాల్లో నీవు నాకై లేవని తెలుసుకున్న నా గుండె స్పందన ఆగిపోయింది.. రోజులన్నీ గడిచిపోతూనే కాలం నా దగ్గర ఆగిపోయింది.ఉరుకుల పరుగులతో కడలి.వస్తూగుర్తులన్చెరిపేసింది కదలని నా అడుగులు ఏమో కొత్త గీతలు గీసింది, గతించిన కాలమేదో నన్ను అద్భుత కల్పనవని నీ వంతు సాగనంపింది.. క్షణాలన్నీ నాకేసి జాలిగా చూస్తూ గత మెరిగిన జీవితం నిన్ను శాసిస్తుందని కంట నీరెట్టు కున్నాయి మీ చెంతలో చేరిన మా జీవితం అహోరాత్రులు సుఖాలను దాటి కష్టాల పరిధిలో తేలుతున్నాయి అంటూ వాపోయాయి ఒకరు లేని బతుకు ఎంత బరువో తోడుకు నోచుకోని నడకెంతో బరువో గతించి సహించి నీకై నేను లేని నాకై నీవు లేని బతుకెంత భారమో....
సంపంగి బూర✍️