...

3 views

"శ్రీ రామ ! "
"శ్రీ రామ రామ రామేతి

రమే రామే మనోరమ ।

సహస్ర నామతత్తుల్యం

రామనామ వరాననే ।।"


"విష్ణుమూర్తి అవతార ఆర్యపురుషా!

దశరథ కుటుంబమున ఆదిపురుషా!

శివ ధనుస్సునే విరిచిన బలపురుషా!

జనకుని కుమార్తెతో జతకట్టిన జానకిపురుషా!

తండ్రి మాటకు పదవి వదిలిన ఉత్తమపురుషా!

సవతి స్వార్థానికి అడవులకేగిన అరణ్యపురుషా!

అసురుడి మాయకు ఆలిని కోల్పోయిన పరమపురుషా!

బంటు సాయంతో సంద్రాన్నే దాటిన సంకల్పపురుషా!

రావణవధతో రాక్షస పీడను తొలగించిన యుద్దపురుషా!

సీతా సంయుక్త అయోధ్య పట్టాభషిక్తుడైన పట్టాభిపురుషా!

చాకలి నిందకు సతిని విడనాడి, నిందలు మోసిన యుగపురుషా!

ఆకరికి పుత్రులతోనే యుద్ధానికి సిద్ధపడిన
అయోధ్య పురుషా!

"శ్రీరామ...!"
అను శరణార్థులకు అండగా నిలిచే అభయపురుషా!"

"శ్రీ రామ..!
సీతారామ..!
అయోధ్య రామ..!"

అందుకో ఈ కవితా నిరాజనం

-mr.satya's_writings ✍️✍️✍️