...

8 views

సహాయనిరాకరణ ఉద్యమం
అదేదో ఉద్యమం, కాదు అదే ఆరంభం,
ముందుకు నడిపింది అప్పటి తరం,
అదే మరో శకపు ప్రారంభం,
ఏక తాటి పైకి మహా భారతం,
ఆయుధాలు వాడలేదట,
అస్త్రలకు పని లేదట,
గాంధీగారి పిలుపుకు పరుగెత్తిన భారతం,
జాతిబేదాలు లేవట,
మతసామరస్యం అంతట,
అందరు లినమాయేను
స్వతంత్రపు ముంగిట,
సూర్యుడు అస్తమించని రాజ్యానికి,
కారుమబ్బు అడ్డు పడిందట,
కర్షకుల సమ్మేళనం,
కార్మికుల సమ్మోహనం,
విద్యార్థుల హోరు,
సంగ్రామంలో వారి జోరు,
కలం పట్టిన కవిత దళం,
చివరి అంచువరకు వారి గళం,
అయ్యోమయపు తెల్లవాడు,
అణచివేత వాడి పోరు,
హోరా హోరు సంగ్రామం,
స్వాతంత్రపు నినాదం,
సహాయనిరాకరణ ప్రోత్సాహం,
స్వావలంబన పరిచయం,
స్వతంత్రపు పోరుతో
స్వరాజ్యపు కాంక్షలతో,
ముందుకు నడిచింది ఆ నాడు
నా భారతం మన మహా భారతం.
సహాయనిరాకరణ ఉద్యమం(1920).......
© krtrstate