...

13 views

పిల్లగాలి ఆశలు
చిరుగాలికి
చింత కలుగుతోంది .
ఎందుకో ఏమో.......
ఎక్కడా వార్తలు
అక్కడే వదిలేసి రాకుండా
చిరుగాలి
చిలిపిగా
తనయుడు
పంట పైరు పై
మెల్లిగా
వీస్తూ
ఉంటే
కొంటె గా
పలకరించింది...

హేమాహేమీలు
కుదిరిన
తరువాత
పిల్లగాలి
తల్లి గాలి తో

ఎందుకు అమ్మ .....!!!?
నాన్న ,
నువ్వూ
నన్ను
పట్టణానికి
వెళ్ళనివ్వరు
ఎప్పుడూ
ఇలా
మట్టి పాత్రలు, కొండలేనా,
అలా
కాస్త ఊరట కలిగించే దిశలో
ఆకాశంలో కనిపించే
బహుళ అంతస్తుల నగరం లో
ఇందనాలతో
నడిచే వాహనాలు మధ్య లో
చుట్టి రావాలని
నా
చిరకాల కోరిక......
మీరేమో
దాన్ని వద్దని అంటున్నారు...
ఎందుకని
అమాయకంగా,
ఆశ్చర్యంగా,
అడిగింది ......
అందుకు
తల్లి గాలి..

నగరాల్లో మేడలుండును,
మనుషుల మనసుల నడుమ
వివక్షలనే గోడలుండును,
బంగారం దేవాలయాలు ఉండును,
వాటి సింహద్వారం ఎదురుగా
ఇరువైపులా బిక్షకుల వరుసలుండును,
డబ్బులు కట్టలు, కట్టలు, ఉండును,
రోగములు కడుపుల నిండా ఉండును....



ప్రతి ఏటా దేవుని ప్రతిమలు
వచ్చును ,దేవుడు పోవు రోజు
డజను మందికి పైగా చెవుడు వచ్చును,
రోజు కొక పెండ్లి జరుగును,
తరువాత దినాన ఎంగిలి మెతుకులు
కుప్పలు పేరుకు పోవును,
ఎచటా
నిలువ నీడ లేకుండా రోడ్లు ఉండును,
వాహనం రొదలకు పసికూనల చెవులు
దద్దరిల్లునూ,


అంటూ ఉంటే తండ్రి గాలి
కలుగజేసుకొని... .........

అర్థ రాత్రి గడిచినా
హారనులు మోగూను ,
అఘాయిత్యంములు
అనేకం
ఆగక జరుగుచుండును,
అంతస్తుల కింద,
అమరులైన కూలెందరో,
అనాధ శరణాలయములు ఎన్నో..
ముసలి వారికి తగిన సదుపాయం కూడా లేని,
వసతి గృహాలు ఇంకెన్నో.. ...

వీధి దీపాలు కింద,
మురుగు కాల్వలు పక్కన,
చెత్త కుప్పలు దగ్గర,
మరుగు దొడ్ల చోట,
ఊపిరితీసుకొంటున్న మానవ
జీవులక్కడ అనేకమంది.....,
శునకాలతో, వరాహాలతో,ఈగలతో,
ఆహారం కోసం ఘర్షణ పడే బాల
కరములెన్నో,

ధనవంతుల
కొత్త రోగాలు ,
పేదవాళ్ళ
పాత కష్టాలు,
మధ్య తరగతి ప్రజల వెతలు,
ఉద్యోగుల ఆందోళనలు ,
నిరుద్యోగుల
చిరు ఆశలు,
ఇవేవీ
పట్టవు అక్కడ ఉన్న
వాడికి
కాలం తో పాటు అలుపెరగకుండా,
పరిగెట్టడం మాత్రమే తన అంతిమ లక్ష్యం.....
లేదని ఆగితే ఆ మరుసటి రోజే
తను నిలబడి ఉన్న చోటు
ఇంకొకరు కింద
తివాచీ
అవుతుంది.. ...మరి.....!!!!!!!!!!!!!!!


నాగరికత లో
మనిషి
ముందు నడిచాడు,
వచ్చిన దారి గుండా గుర్తులు పెట్టి,
బాటలు వేశాడు........
బండ్లు చేసి,
మూగ జీవాల యాత్రలు
నడిపాడు......
డబ్బు పెరిగి
దారి
పెద్దదై,
వాహనాలు
తెచ్చాడు
అందకు
వాహనాలు
కాలుష్యాన్ని
కట్నం గా ఇచ్చాయి.............

పట్టణాల్లో నివసించే వారికి
కాలుష్యం
ఇంటి
వాకిలి
పేదరికం
పెద్దమ్మ ....
నిరుద్యోగం
మొదటి సంతానం,
ఆకలి,
అర్దాంతర చావులు తోబుట్టువులు,
కన్నీరు నిత్య పన్నీరు,
రోడ్లు... రక్తం.. రుచి ..చూడని.. నెల.
ఉండదు...
వాలంటరీ సేవకుల వాహనాల వద్ద
ఆహార పదార్థాలు తీసుకోవడం కోసం...
కొట్లాటలు ఆగవు,
దారిద్ర్యం లేని గడపలుండవు..

అందుకే మేము సైతం నీకు
చెప్పేది....
పట్టణాలు....
మెరుగులు దిద్దిన అగ్ని రవ్వలు,
తెరచి ఉన్న మృత్యువు నోళ్ళు,
తల్లి వంటి
పల్లెలు వదిలి బయటకు పోకు, ఏరి,కొరి, ఇర్క పోకు,
అంటుంటే పిల్లగాలి...
తల అడ్డంగా ఊపి
పల్లెను
వదలను,
పట్టణం
తలవను
అంటుంది..................
.........by............. govind@......................

































© All Rights Reserved