...

11 views

అందుకోవే నా ప్రాణం..
తీరని కోరికలు ఏవో మదిలో సుడులు
తీరుగుతుంటే....
హృదయం బరువెక్కి పోతోంది
చేతి స్పర్శ, వేడి శ్వాస,ఘాటు ఆలింగనము ల సమయం లో
...........ఆగిపోయిన కాలం,
ఆవిరవుతున్నయవ్వనం,

చెదిరి పోని జ్ఞాపకం,
రెండు కళ్ల స్వప్నం,
చేరలేని వాహనం,
భరించలేని దారుణం,
అందుకోవే నా ప్రాణం,
ఇక నుంచి నువ్వే నా సర్వస్వం.........

చింత లేని గుండెల్లో,
పదిలంగా ఆ క్షణం,
నిదురించాలి ఇద్దరం,
కలువ సొగసులు,
మల్లె మెరుపులు,
తీగలై అల్లుకుంటున్న,
శుభ తరుణం,
తేనె పలుకులు,
భావి స్వరాలు,
అందుకోవే నా ప్రాణం
ఇక నుంచి నువ్వే నా సర్వస్వం.....

మాయదారి గాలులు,
మనసులో వీస్తుంటే,
చెలి పెదవులు సెగల అలలు,
తనువు లో హోరేత్తుతున్నాయి...,
చూపుల వలలు ,
నడకల హొయలు,
నడుం ఒంపులు,
తల వంపులు,
తెస్తుంటే,
మురిసే,
తడిసే
వయసే,
అందుకోవే నా ప్రాణం, ...
ఇక నువ్వే నా సర్వస్వం.....




© All Rights Reserved