...

2 views

ప్రేమ
కనులా.. కలల కొలనులా
బుగ్గలా.. సిగ్గుల ఆనవాలా

అందమా...అద్భుత శ్వేత సౌందర్యమా
అనునిత్యం నా నయనాల బంధమా

అల్లరి మాటల మనోహరీ
చిలిపి చూపుల.. చిన్నారీ

వదనం ప్రసన్నం , మనసు ప్రశాంతం
ఆలోచన ,ఆచరణ.. ఎవరెస్టoతటి ఉన్నతం

నీతో సమయం.. అందమైన అనుబంధం
నీతో ప్రయాణం..అనుభూతుల సమాహారం ..