...

1 views

దివాలాదేవి మహాత్మ్యం వ్రత కథ
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పేరడీ కథ*-----
పురోహితుణ్ణి పిలిపించుకొని వ్రతం చేయడం చేయించుకోవడము తెలిసిన విషయమేకదా. వ్రతం చేసినందుకు కలిగే ఫలాన్ని గురించి ఫలశృతి గా పురోహితుడు చెప్పే కథ వినటం, తరువాత వ్రతానికి ముగింపు చేయటము జరుగుతుంది. వ్రత కథ ను పేరడీ గా చిలకమర్తి లక్ష్మీనరసింహము గారు రాసిన ఈ దివాలాదేవి వ్రతకల్పం ఇలా వినిపించటం జరుగు. డబ్బులు తీసుకొని ఎగగొట్టే వారిని ఉద్దేశించిన కథ ఇది.ఇలాంటివారు ఏ కాలము లో నైనా ఉంటారు.
* దివాలాదేవి వ్రతకల్పం*
నారదుడు బ్రహ్మతో, మహాత్మా!బ్రహ్మదేవ!భూలోకములో చాలామంది మానవులు ధనం లేక ఇబ్బంది పడుతున్నారు.కొందరేమో ఐశ్వర్యముతో తులతూగుతున్నారు. పేదవారు కష్టపడకుండా ధనవంతులు అగుటకు ఏదైనా ఉపాయముందా? అని అడుగగా,
"ఓయీ నారదా నీవు అడిగిన ప్రశ్న మిక్కిలి మంచిది. దానికి ఉపాయముంది. అది పరమ రహస్యం. అది మితంగా ధనం వాడేవారికి, గౌరవం కొరకు దేవులాడే వారికి, జాలిగలవారికి చెప్పరానిది. అది దివాలాదేవి ...