...

1 views

నీకై ఎదురుచూపు...✍️😍
కల్మషంలేని స్నేహామా...
నీకై ఎదురుచూపు...
మొబైల్ వచ్చాకా..వందల్లో స్నేహితులు..
వరదల్లా మేసిజిలు..సరదా కోటేషన్లు...
పేస్బుక్కువాల్ మీద పేజీల కొద్దీ శుభాకాంక్షలు...
వాట్సాప్ నిండా జీవంలేని పలకరింపులు..
స్నేహానికి కూడా ఓ దినం చేసే నాగరికులం మరీ..

స్నేహమంటే వెలుతురిచ్చే దీపకణం
స్నేహమంటే ఊపిరి నిలిపే మహగుణం..
రాముడితో మైత్రి సుగ్రీవుని రాజుని చేసింది..
కృష్ణుని తో సావాసం ఫల్గునితో కురుక్షేత్రం గెలిపించింది..
మంచిని చూపి మహోన్నతులను చేసిన నెయ్యము..
దుర్యోధనుని స్నేహం వల్ల కర్ణుడి కి కష్టాలే తెచ్చేనుగా..
అందుకే నీ స్నేహితులెవరో చెప్తే..
నీ గుణాలు తెలుస్తాయంటారు..
ఇప్పటికే కొన్ని మల్టినేషన్ కంపెనీలు
రెఫరెన్స్ ల పేరుతో స్నేహాలకే పెద్దపీట వేస్తున్నారు...

కానీ..మనమెంత మందికి నేస్తాలమో తెలియదు కానీ..
మనకెంత మంది నేస్తాలో లెక్కపెట్టేద్ధామనీ మనసు కాంటాక్ట్ లిస్టులో వెతికా..
ఎందుకో...పట్టుమని పది పేర్లు కూడా పలుకరించలేదు నన్ను..
మరీ మొబైల్లో వాట్సప్ మొమొరీ నిండిందిగా..
అందులో మాటలన్నీ టమాటా కీ పెరిగిన రేటులా తాత్కాలికమే..

నీకు కష్టమొచ్చినపుడూ కనిపెట్టుకున్నదెవరో కాస్తంత పరిశీలించంటూ మనసు నస..నిజమే..నా బ్రతుకు చెడినా...
నన్ను నన్ను గా గుర్తించి న జనమే కదా నా ప్రపంచం...
వాళ్ళు మాత్రమే నా మనసు కాంటాక్ట్లో ఉన్నారు...
మిగిలినవన్నీ...వారి అవసరానికో...రేపటి నా అవసరానికో దాచిపెట్టిన అవకాశమంతే...
అసలు స్నేహమంటే...ఎవరితో మన మాట వింటే ఆనందం రెట్టింపు అవుతుందో..ఎవరి సాంగత్యం మనకు అత్యంత దైర్యాన్నీ ఇచ్చేస్తుందో....వాళ్ళే నిజమైన స్నేహితులు...
అలాంటి నేస్తమై నా మదిలో నిలిచిననీకోసమే నా ఎదురుచూపు...
Dedicated to my besties who are standing with me in my bad days
happy friendship day
🌷🌷🌷🌷🌷🌷🌷🌷