...

7 views

నవ్వుకు రూపు గీస్తే..నువ్వే...🥰
నవ్వుకి రూపు గీస్తే నువ్వే..
సంతోషానికి ఊపిరి పోస్తే నువ్వే..

మనసులో ఆనందాలను మీటి...
సుస్వరాలను పాడగలవు...
కళ్ళతో మెరుపుల సరాగాలతోటి..
కట్టికట్టును చేసేయగలవు...

శిశిరం దాచిన మంచుబిందువువో..
వసంతాలే పూసుకున్న లేతకొమ్మవో..

ఎదుటపడితే ఎదన గాయం..
కలలో దిగితే ఊహాలకు సాయం..

దివిసీమ జాడ మరిచిన అప్సరస..
భువిన నువ్వండగా హరివిల్లుతో పనేమిలేదట..

అమృతభాండాన్ని ఆ పెదవ్వుల్లో దాచి..
సిగ్గుల తాళాలతో కనురెప్పలను వాల్చి..

బ్రహ్మయ్య నీ బొమ్మనే
అమ్మాయి రూపుకి అచ్చులా వాడుంటాడే..
వందల పరిశోధనల ఫలితమై ఉంటావు మరీ..

అసలు...ఎన్ని లోకాలు వెతికిన
ఎన్ని లోహాలు చెక్కిన..
జక్కన్న కూడా చెక్కలేని శిల్పమా...
నా ఆశలను ఆనందాలుగా దాచిన తల్పమా...

వానమబ్బు దాచిన చందమామలా...
వీణవంకల్లో దాగిన కొత్త రాగమా..

అవనికి చుట్టంలా వచ్చే ఆమనిలా వచ్చి వెళ్ళకే..
పరిమళాలను మోసుకొచ్చే పైరగాలిలా నాచుట్టే ఉండవే..!!