...

4 views

రాముడై వరుడంటా...వధువు సీతమ్మను చేపట్టగా✍️💕
ప్రియమైన రామయ్య తండ్రికి
భక్తితో రాయునది..
శివధనుస్సు విరిచి జానకి ని చేపట్టగా
సీత స్వయంవరము ఒట్టి వంకనే సుమా..
నెలవంక ధారణలో వధువు సీతంటా..
సూర్యపుత్రుడుగా వరుడు రామయ్య అరుదెంచగా..
ఏడేడు లోకాలు సీతారామంగా
ఎల్లజనులెల్లరు మీ పేరును తలువంగా..
ఏమయ్యో రామయ్య తండ్రీ..
ఎదనిండా సీతనే నింపేయకండీ..
హనుమకీ కాస్త స్థలమిడువండీ..
లక్ష్మణసమేత రామయ్యా...
లంకకీ చేరిన సీతని కావంగా దేవుడవయ్యా..
సుందరకాండన ప్రతి వాక్యం..సువర్ణవిరచితం...
వినిన వారి జన్మ చరితార్థం...
పర్ణశాల ప్రకృతి ఒడిన..పశుపక్షాదులతో
కలిసి కాపురముండగా రఘురామా..
పసిడి హిరణ్యమై కపటనాటకము..
దశకంఠునితో తెగని వైరము..
లంకనీ కాల్చిన సీతకష్టం..
నిప్పుగా తేల్చిన అగ్నిప్రవేశం...
లవకుశల శక్తి పరాక్రమం
రాజుగా రాజసూయయాగం..
పసిడిబొమ్మాయేగా పావనిమాత..
కన్నప్రేమతో కౌసల్యమాత..
కపటమాటల మందర ధౌత్యం..
పతిప్రేమలో మండోదరి నిత్యం..
స్నేహించడంలో రామసుగ్రీవతత్వం..
అసురలలో నీతినిండిన విభీషణగుణం..
నేర్చుకో దలిచిన నేటికి నిత్యనూతనం..
శ్రీరామ నీ నామామృతం..
సకలపాపహరణం...