...

3 views

ప్రేమలేఖ
తిరిగి రాలేని నీకోసం..
వేచి వేచి ఏనాడు ఆగుతుందో తెలియని నా హృదయ స్పందన..
నేనేనా.. ఇది నిజమేనా..
కల గానీ .కథ గానీ కాదుగా..
నిజమేనని నమ్మేదెలా..
నిరీక్షణం ఇక గతమేనా..
నీవేనా ఎదుట, కల కాదని.. నీవేనని..ఎద వినదేలా..వినేదెలా..
అనుక్షణం.. జ్ఞాపకాల్లో కరిగి,
ఊహల్లో ఊరేగి,
నిద్దరలేని రాత్రుల్లో.. కన్నీటిగా మారి
రావని..తెలిసినా..
గుండెనిండా గురుతులని..
మనసు వదలని నీ మాటలని..
పొరలు పొరలుగా కమ్మేస్తున్న దుఃఖానికి...
నీ రాక.. ఓ అద్భుతం ..ఆశ్చర్యం... పదాలకందని అనుభవం
అసలు నువ్వేనా . ఎలా.. ఇదెలా .అసలెలా.
రావనే.. లేవనే..కాదనే .. ఇలా అలవాటైన నా మనసుకి.. నిన్నిలా..?
ఓ ప్రశ్నగా..పరిచయం లేని పలకరింపులా...ఉంది
గతం దేవత లేని చీకటి గుడిలా మిగిలే కదా.. వెన్నెలే లేదుగా..
మరి.. ఈ వేళ..ఈ వెలుతురేల..
నువ్వెలా..అసలు నువ్వేనా..?
అయినా..ఈ ప్రశ్నలేల? నువ్వొచ్చేసావ్ కదా..

కానీ..ఉన్నమాట..నువు లేవని..ఒంటరితనంతో ప్రేమలో పడ్డానేమో..
నిను చూస్తే ఓ భయం.. ఈసారి నువు...