...

10 views

అతని కన్నీళ్లకు కారణం ఎవరు??
దూరంగా ఉన్న అడవిలో ఓ
వ్యక్తి తన భార్య కోసం ఎదురు చూస్తూ
ఉన్నాడు........

అతను అనుకోలేదు అలా ఎలా తనను వదిలి పెట్టి వెళుతుంది అని ,

తాను కోరుకుంది భర్త నుంచి
ప్రేమ ను కానీ,
ఆ స్థితిలో తానప్పుడు,
వేరే గూటిలో ఉన్నాడు
మరో రంగుల చిలుకతో..........

తను భరించలేక పోయింది,
పెనిమిటి ని తన చుట్టూ కట్టుకుందామనుకుంది కానీ
అతడు ఆపాటికే కొత్త మాయలో
బంధీ........


ఎక్కి, ఎక్కి,
ఏడ్చింది,
తల బాదుకుందీ,
చుట్టూ ఉండే వారు.....
చుట్టాలు కాలేకపోయారు,
కాటికి ఆపలేకపోయారు,

ఆమె మరణం అతనికి చెంప దెబ్బ,
ఆమె రోదన అతని నిద్రలేమి,
ఆమె నిశ్శబ్దం.... ఆయన్ను గగ్గోలు పెట్టే లా చేసింది......
ఆమె ప్రేమ అతడి పాలిట ముళ్ళకొరడా.......

అతడు కన్నీరు పెట్టని రోజు లేదు,
గుండె పగలని క్షణమూ లేదు,
ఆమె లా అతను ధైర్యమున్నవాడు కాదు,
ఎంత వరకు విలపించినా తానెప్పటికీ
రాదు.........

ఆమె పరిమళం తనకు విసుగ్గా ఉన్నప్పుడు కొత్త మందారం కోసం
పరుగులు పెట్టాడు. ...
తీరా అది నకిలీ అని తెలుసుకున్న
అతడు ..భార్యమణి కి గల పరిస్థితి.
విని అక్కడి కక్కడే కూలి పోయాడు......

అనుకున్నాడు
అందరూ తన వాళ్ళేనని,
కానీ
తెలుసు కున్నాడు....
తన కోసం
తను సైతం లేడని,

అతనిప్పుడు
శపించబడ్డ రాయి,
విసిరిన తునక,
పీల్చి వదిలిన
బుడగ,
ఎడారి చిలుక,
రాతిరి ముత్యం,

అయినా
ఏదో ఒక ఆశ,
తన శ్వాస ......
తనని
బ్రతికేలా
చేస్తోంది.....

నడిచే కాళ్ళు,
అలసి పోతున్నా,
ఒంట్లో సత్తువ
అయిపోతున్నా.......
కళ్ళు తేలిపోతున్నా...

అతను ఆగలేదు,
పయనం ఆపలేదు,
..........................
....................



గొంతు లో ఆఖరి ఊపిరి ఆడుతుంటే
శక్తిని కూడగట్టు కొని,
నాకు నా భార్య కావాలని ఎనిమిది దిక్కులు వినిపించేలా
అరిచాడు..........
పిచ్చి వాడు లా
గంతులు వేస్తూ ఉంటే..
ఆకాశం....
అరిచింది,
మేఘం వర్షించింది........,
పుడమి ఫక్కున నవ్వింది....

రాళ్ల లా మీద పడుతున్న వాన చినుకుల్లో అతని కన్నీళ్ళు ,
కనుమరుగై,
అతను
విచారంగా,
నడిచాడు........

అతని కన్నీళ్లకు కారణం ఎవరు???
వాటిని తుడిచే దెవరు....?????

............................................by.............................. Govindu@...........













© All Rights Reserved