...

4 views

ప్రేమ నేర్పే పాఠాలు 💔

© sravani writtings
చేతిరాతల్లో చెప్తున్నా ఈ ప్రేమ,
తలరాతనే మార్చేస్తుంది.

లేత వయసులో మొదలైన ఈ ప్రేమ,
కన్న ప్రేమనే ఎదిరిస్తుంది.

తెలిసి తెలియని ఆలోచనలతో చిగురించిన ఈ ప్రేమ,
ఎన్నో తప్పటడుగులను వేయిస్తుంది.

చెయ్యి పట్టి నడిపించిన నాన్నను కాదంటున్న ఈ ప్రేమ,
సమాజం ఆడే ఆటలో ఆట బొమ్మగా మార్చేస్తుంది.

చదువు పాఠాలను మరిపించిన ఈ ప్రేమ,
జీవితం నేర్పే గుణపాటాల్లో నెట్టేస్తుంది.

" ఈ ప్రేమ ఆటలో గెలిచి పెళ్లి పీటలు ఎక్కిన వారు కొందరైతే, ఓడి దివికెక్కిన వారు ఎందరో "💔
శ్రావణి