...

15 views

సైన్యం
తిప్పలు పెట్టదలచి నీ దరికొచ్చిన ముప్పేదైనా...
ఉప్పెనంత ధైర్యందాల్చిన నీ గుప్పెడు గుండెను చూసి బెదరక మానదా!

పెను ప్రమాదమైనా...
ప్రతిఘటించి పోరాడే నీ ఆత్మస్థైర్యాన్ని జూచి వెను తిరిగి పారిపోదా!

నీయంతు చూడ వచ్చిన విపత్తు సైతం
నీ సత్తువ చూసి నీరుగారిపోదా!

పరిస్థితి ఏదైనా, ప్రమాదపు పరిధి ఎంతున్నా...
జీవితమనే ఈ యుద్ధంలో నిను గెలిపించే నీ సైన్యం నీ ధైర్యం!


...మీ హేమంత్ కారిచర్ల
© Hemanth Karicharla
@hemanthsays