...

6 views

నీ తలపే....✍️
నీ తలపే
నాలో కొత్త చిగుర్లు వేయగా
శిశిరం దాటిన వసంతాన్ని నేను...!!
నీ తలపే
నాలో నూతనోత్సాహం నింపగా
మబ్బులని దాటిన పున్నమినీ నేను...!!
నీ తలపే
నాలో నన్ను చూపగా
రంగుల వల్లిక దిద్దిన ముంగిలి నేను...!!
నీ తలపే
నాలో నవ్వుని పులుమగా
సంతోషాల రూపు అద్దిన కుంచెనీ నేను..!!
నీ తలపే
నాలో దైర్యం ఒంపగా
అభిమానం పంచే హరివిల్లును నేను...!!
నీ తలపే
నాలో గెలుపు తలుపు తీయగా...
నన్ను నేను చెక్కుకునే మెత్తని ఉలినీ నేను..!!


Related Stories