...

4 views

ఉగాది పచ్చడి 🥭

© sravani writtings

ఉగాది పచ్చడిలో కలిపిన కొత్త బెల్లం,
ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో తీయనైన సంతోషాలు ఉంటాయనిడానికి సంకేతం.

ఉగాది పచ్చడిలో కలిసిన ఉప్పు ఎంతో రుచికరం,
జీవితంలో నువ్వు చేసే మంచి పనులే తెచ్చి పెడతాయి నీకు గౌరవం.

పుల్ల పుల్లగా చింతపండుతో పులకరింప చేస్తున్న పాడ్యమి రోజు ,
పరిస్థితులను అంచనా వేసి నేర్పుతో వెయ్యాలి అని అడుగు.

పచ్చి మామిడికాయ ముక్కలు చేస్తాయి పచ్చడి నీ వగరు,
రేపు వస్తున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఉండాలి నువ్వు తయారు.

కారం వేసిన ఉగాది పచ్చడి ఎంతో ఆరోగ్యం.
సహనం కోల్పోకుండా పరిస్థితులను చక్కబెట్టే గుణం నీకెంతో సౌభాగ్యం.

వేప పువ్వు కలిసిన ఈ ఉగాది షడ్రుచుల పాయసం,
చెప్తుంది జీవితంలో వచ్చే బాధను ఓటమిని అంగీకరించడం.

చేదుగా ఉందని చింతించకు తినక తినక వేప కూడా తీయకవును,
బాధలు ఓటమి ఉన్నాయని కృంగిపోకు బెల్లం లాంటి తీయనైన సంతోషాలు కూడా ఉన్నాయని ఆనందించు.

పంచాంగ శ్రవణం విని రాశులే నిర్ణయిస్తున్నాయి నీ జీవితాన్ని అని బాధపడకు,
ఈరోజు నీ ప్రయత్నం రేపటిని విజయం అని గుర్తించు.

ఇవన్నీ కొడుకుని ఈ శోభకృత నామ సంవత్సరం మీకు ఎన్నో సంతోషాలను వెలుగులను తేవాలి అని కోరుకుంటూ, అందరికీ ఈ శోభకృత నామ శుభాకాంక్షలు 🙏

Related Stories