...

9 views

అతను కళ్ళు రుద్దుకుంటున్నాడు
అతను తన కళ్ళను రుద్దుకుంటున్నాడు....

ఎందుకంటే తనకు రోగాలు ఉన్న జనాలు కనిపిస్తుంటే,
ఎందుకంటే ఆరేళ్ళు కూడ
నిండని పాప...
మెడలో తాళి బొట్టు పెట్టుకుని..
పనికెళుతుంటే,

నింగి లోని తారలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు జల, జల
రాలుతుంటే,
హరివిల్లు రంగులు సైతం..,
కల్తీ అవుతుంటే,
చిన్నారులు కూడా గర్భంలోనే
అసువులు బాపుతుంటే,
కృత్రిమ పనివారు
మనిషిని ఓడిస్తుంటే,
అతను చూడలేక కళ్ళు
రుద్దుకుంటున్నాడు....

రాయి నుంచి రాకెట్టు దాకా,
బండి నుంచి, బెంజి కారు దాకా,
కాగడాల నుంచి ఆటోమేటిక్ సోలార్ విద్యుత్ దాకా,
గుహల నుంచి, అంతస్తుల దాకా,
మనిషి వృద్ది చెందుతున్నప్పటికీ,
అతని చూపులు రోదసి మీదే
ఉండటం చూసి ఆశ్చర్య పోతూ

అతను కళ్ళు రుద్దుకుంటున్నాడు..
.................by...... govind@





© All Rights Reserved